కోలీజియమూ రద్దు
తాము అధికారంలోకి వస్తే అవిచేస్తాం,ఇవి రద్దు చేస్తామని బీజేపీ వరుసగా చిట్టా విప్పుతున్నది.అమిత్ షా ఎన్నికల సభలో మాట్లాడుతూ మూడోసారి గెలుస్తామని,త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, వచ్చే ఎన్నికలు జమిలిగా జరుగుతాయని పేర్కొన్నారు.అలాగే పాకిస్తాన్ పాలనలో ఉన్న పీఓకేను భారత్లో కలుపుతామని పదేపదే ప్రస్తావిస్తున్నారు.అలాగే కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చి త్యరలో ఎన్నికలు జరిపిస్తామని చెప్పడం విశేషం.గత 10 ఏళ్లలో కాశ్మీర్లో సాధారణ స్థితి నెలకొనేలా చేశామని చెప్పుకున్నారు.లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ భారీగా,ప్రశాంతంగా జరగడం మా ప్రభుత్వ విజయమని చెప్పుకోవడం గమనార్హం.ఆయనతో పాటు ఉన్న కేంద్ర మాజీ మంత్రి,ఆర్ఎల్ఎం (రాష్ట్రీయ లోక్ మోర్చా)నాయకుడు ఉపేంద్ర కుశ్వాహ మరింత ముందుకు వెళ్తూ న్యాయమూర్తుల నియామకం చేసే కోలీజియం ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేయడం గమనార్హం. కోలీజియంలో చాలా లోపాలు ఉన్నాయన్నారు.ఇది అప్రజాస్వామ్యమన్నారు. దళితులు,ఓబీసీలు,అగ్రవర్ణాల లోని పేదలకు అవకాశం లేకుండా ఈ సిస్టం చేస్తున్నదన్నారు.ప్రస్తుత హైకోర్టు,సుప్రీంకోర్టు బెంచీలపై కూర్చున్న కొన్ని కుటుంబాల సభ్యులను చూస్తే అర్ధమవుతున్నదన్నదని ఆరోపించడం విశేషం. ఆయన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ స్పందించారు.గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేసినప్పుడు కనపడని లోపాలు ఇప్పుడు కనిపించాయా అని గుర్తు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ పై,ఆ గ్రూప్ ప్రమోటర్ అదానీపై కాంగ్రెస్ నేత రాహుల్, ప్రధాని మోదీ లు తమ ఎన్నికల సభల్లో చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో స్టాక్ ఇన్వెస్టర్ ఒకరు పిటిషన్ వేసారు. భవిష్యత్ లో వారు మరల అలా ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ స్టాక్ ఇన్వెస్టర్ ఇంజక్షన్ వేసారు.వారు చేసిన వ్యాఖ్యల తో అదానీ గ్రూప్ స్టాక్ లు ఒడుదుడుకు గురవుతున్నాయన్నారు. ఫలితంగా షేర్ హోల్డర్స్ నష్టపోతున్నారని పిటిషన్ సారాంశం.రాహుల్ తన ప్రచార సభలో అదానీతో సహా కొంతమంది పారిశ్రామిక వేత్తలకు మోదీ ప్రభుత్వం రూ. 16లక్షలకోట్లు మాఫీ చేసిందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పిటిషనర్ వాదన. అలాగే మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసుకు అదానీ,అంబానీ లు ముడుపులు పంపారని ఆరోపించిన విషయం విదితమే.