డేటా ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్న ఎయిర్‌టెల్
న్యూఢల్లీి : భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్‌టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్ తాజాగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు కంగారు పడ్డారు. ఇది భారతదేశంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ఈ ప్రకటనపై ఎయిర్‌టెల్ స్పందించింది.ఎయిర్‌టెల్ ఇండియా డేటా ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ.. తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్‌టెల్ సిస్టమ్‌ల నుంచి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. డార్క్ వెబ్ ఇన్‌ఫార్మర్ ద్వారా వెలువడిన తప్పుడు డేటా ఉల్లంఘనగా దీన్ని అభివర్ణించింది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే అంతకు ముందు డార్క్ వెబ్‌లో ఓ పోస్ట్ ప్రకారం, ‘%ఞవఅ్గవఅ%’ అనే మారుపేరుతో హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ ఇండియా కస్టమర్ల మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ ఐడీ, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలతో కూడిన డేటాబేస్‌ను విక్రయానికి ప్రయత్నించాడు. క్రిప్టోకరెన్సీలో చెల్లించాల్సిన దీనికి 41 లక్షల రేటు పెట్టాడు. దీంతో కస్టమర్లు కంగారు పడ్డారు. స్పందించిన టెలికాం కంపెనీ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడని..ప్రకటించింది.