జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

తెలంగాణ

ఏచూరి ఉండివుంటే ఇలంటి వాటిపై పోరాడేవారు
ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది
సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌
హైదరాబాద్‌ : జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్టాల్ర మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జమిలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ స్పిరిట్‌ ను దెబ్బతీసేందుకే బీజేపీ ఈ ఎన్నికల కుట్ర చేస్తోందన్నారు. జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయడానికి సీతారాం లేకపోవడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో శనివారం జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు రేవంత్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. చనిపోయాక కూడా ప్రజలకు ఉపయోగపడ్డ గొప్ప నేత సీతారం ఏచూరి అని కొనియాడారు. కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన సీతారాం ఏచూరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి సేవలు మరువలేనివని, దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని చెప్పారు. సీతారాం ఏచూరి లోటు పూడ్చలేనిదని సిఎం అన్నారు. దేశంలో ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని గుర్తుచేశారు. రైట్‌ టూ ఇన్ఫర్మెషన్‌ యాక్ట్‌ తీసుకురావడంలో ఆయన కృషి గొప్పదని వివరించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కమ్యూనిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. ఉపాది హామి, ఆహార భద్రత పథకాలు కమ్యూనిస్టుల ఆలోచనలతోనే వచ్చాయన్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఈ రోజుల్లో సీతారాం ఏచూరి ఒకే పార్టీలో ఉన్నారని… ఉన్నత కుటుంబంలో పుట్టి.. అణగారిన వర్గాల వారి కోసం సీతారాం ఏచూరి పోరాడారని అన్నారు. సీతారాం ఏచూరి జీవితం యువనాయకులకు ఆదర్శమని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. తాను,సీతారాం జేఎన్‌ యూలో చదువుకున్నామని ..అక్కడే వారితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇందిరాగాంధీ యూనివర్శిటీకి వీసీ గా ఉన్నారని.. ఆమె రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చామన్నారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి.. ఎత్తివేసిన తరువాత కాలేజీలో చేరామన్నారు. ఏచూరికి హైదరాబాద్‌ లోనే వామపక్ష భావాలు ఉండేవని.. ఆయన మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షులుగా పనిచశారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. క్యాంపస్‌ లో విద్యార్యుల అణచివేత ఉండొద్దని పోరాటం చేశారు సెక్యూలర్‌ ప్రజాస్వామిక విలువలు కాపాడటానికి అన్ని పార్టీలను ఏకం చేయడానికి ఏచూరి ఎంతో కృషి చేశారని తెలిపారు. తేడాలు పక్కనపెట్టి దేశాన్ని కాపాడుకోవడమే ఏచూరికిచ్చే నివాళి అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నాలుగు విషయాలు ఏచూరి మన ముందు నిర్దేశిరచిన లక్ష్యాలు అని చెప్పారు. తేడాలను పక్కనపెట్టి దేశాన్ని కాపాడుకోవడమే మన ఏచూరికి ఇచ్చే నివాళులు అని అన్నారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం రవీంద్రభారతిలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ మాట్లాడారు. బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీతారాం ఏచూరికి నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *