ఆచార్య పి.సి వెంకటేశ్వర్లు
ఈతరం కవితా వేదిక(తిరుపతి) ఆధ్వర్యంలో కవి కొమ్మవరపు విల్సన్ రావు గారి కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ పరిచయ సభ విజయవంతంగా జరిగింది. స్థానిక తిరుపతిలోని యూత్ హాస్టల్ వేదికగా జరిగిన పుస్తక పరిచయ సభకు ముఖ్య అతిథిగా శ్రీ భూమన్ గారు,ప్రధాన సమీక్షకులుగా ఆచార్య పి.సి వెంకటేశ్వర్లు గారు,విశిష్ట అతిథిగా డా.వై సుభాషిణి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈతరం కవితా వేదిక అధ్యక్షులు శ్రీ తోట వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు. ఈ సభలో సమకాలీన సామాజిక వాస్తవిక అంశాల్ని గురించి, మానవీయ విలువలు గురించి మాట్లాడిన కవిత్వంగా పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ భూమన్ గారు మాట్లాడుతూ మానవ చైతన్యాన్ని కాంక్షిస్తున్న కవిగా విల్సన్ రావు గారిని అభివర్ణించారు.ఆత్మీయ అతిధులు డా.వై.సుభాషిణి గారు ‘అమానవీయత మీద ఎక్కుపెట్టిన కవితాస్త్రం’గా నాగలి కూడా ఆయుధమే కవితా సంపుటిలోని కవితలను అభివర్ణించారు.ప్రధాన సమీక్షకులుగా ప్రసంగించిన ఆచార్య పి.సి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ‘సమకాలీన సామాజిక చైతన్య గొంతుక ‘నాగలి కూడా ఆయుధమే’కవితా సంపుటి అని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా కథకులు శ్రీ ఆర్.సి.కృష్ణ స్వామి రాజు గారు, కవి పల్లిపట్టు నాగరాజు గారు,సీనియర్ పాత్రికేయులు డా. కొత్వాలు అమరేంద్ర గారు పాల్గొన్నారు. ఎస్.వి.యూ.రిసేర్చ్ స్కాలర్ గిడ్డకింద మాణిక్యం వందన సమర్పణ చేశారు.
నగరంలోని సాహితీవేత్తలు సాకం నాగరాజు గారు,డా.రాసాని గారు,మూరిశెట్టి గోవింద్ గారు, డా. మన్నవ గంగాధర గారు,ఆకుల మల్లేశ్వరరావు గారు ఆచార్య దామోదరనాయుడు గారు,అంకమనాయుడు గారు,జిల్లెళ్ళ బాలాజీ,కవి సురేంద్ర రొడ్డ, గొడుగుచింతల గోవిందయ్య, ఎస్.వి.యూ.రిసెర్చ్ స్కాలర్ ఈ.కుమరేశన్,ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి రమేష్,సురేష్,రాజశేఖర్, సోమలింగడు, ఈశ్వరయ్య వంటి ప్రముఖుల మధ్య సభ అత్యంత ఉత్సాహంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఆర్.సి.కె.రాజు,పల్లిపట్టు నాగరాజుల కృషిని పలువురు అభినందించారు.