అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం

సాహిత్యం హోమ్

జాతీయ పురస్కారాలకు ఆహ్వానం

భోపాల్‌ కేంద్రంగా సుమారు అరవై ఏళ్లుగా పనిచేస్తున్న అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం , శ్రీమతి సుమన్‌ చతుర్వేది మెమోరియల్‌ ట్రస్ట్‌ , జాతీయ పురస్కార సభ , కావ్య గోష్ఠికి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, హిందీ రచయితల పేర్లు ఆహ్వానింప బడుతున్నాయి. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం, శ్రీమతి సుమన్‌ చతుర్వేది మెమోరియల్‌ ట్రస్ట్‌ వారి జాతీయ పురస్కార సభ (2022-23), కావ్య గోష్ఠి 2024 ఫిబ్రవరి నెల , శనివారం 17వ తారీఖున నిర్వహింపబడుతుంది. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం , శ్రీమతి సుమన్‌ చతుర్వేది మెమోరియల్‌ ట్రస్ట్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుపబడే వార్షిక పురస్కార సభ (2022-23) , కావ్య గోష్ఠి కొరకై ప్రబుద్ధ సాహిత్య కారుల (వార్షిక సభ్యులు) నుండి ఎంట్రీలు ఆహ్వానింపబడుతున్నాయి . కవులు తమ రచనలను అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం వారి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యాలయం , నెల్లూరు, 9849230443 ఫోనుకు ఈ మధ్యనే తీయించుకున్న పాస్‌ పోర్ట్‌ సైజుఫోటో, తమ పరిచయంతో పాటు perugurama20202@gmail.com మైల్‌కి పంపవలసినదిగా అభ్యర్థన.

కవితాగోష్ఠిలో తమ రచనలు చదువ ఇచ్చగించే జీవిత సభ్యులు/వార్షిక సభ్యులు 25 జనవరి 2024 లోగా తమ పేరు, ఫోన్‌ నంబరు 9849230443 వాట్స్‌అప్‌ నెంబరుకి తప్పక తెలియ చేయాలి. వార్షిక పురస్కారం , కవితా గోష్ఠి లో తమ రచనలు వినిపించే వారు తప్పక ఆజీవిత సభ్యులు , లేక సదరు సంవత్సరంలో సాలు చందాదారులై ఉండాలి. కావ్య గోష్ఠి సమితి ద్వారా అనుమతించ బడిన వారు తమ కవితా శ్రవణం 8 నిమిషాల లోగా పూర్తి చెయ్యాలి. ఈ సంవత్సరం ప్రదానం చేయబడే పురస్కారాలు – సాహిత్యశ్రీ, సంస్కృతీ భూషణ్‌, భారత్‌ భాషా భూషణ్‌, సరస్వతి సమ్మాన్‌ ఉంటాయని జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ . వీరేంద్ర సింగ్‌, మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ పెరుగు రామకృష్ణ, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం తెలియ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కార్యవర్గంలో అధ్యక్షులుగా డా పెరుగు రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా మందరపు హైమావతి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శిగా డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య, కార్యదర్శులుగా వి.ప్రతిమ, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, కోశాధికారిగా పెరుగు సుజనారామం వ్యవహరిస్తున్నారు.

– సృజనక్రాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *