ఏపీ కూటమిదే

ఆంధ్రప్రదేశ్

విపక్షానికి పరిమితం కానున్న వైకాపా
తెలంగాణలో ఎంపీి సీట్లను పెంచుకోనున్న కాంగ్రెస్‌

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల పక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. వివిధ విూడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్‌ తగినట్లుగానే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి. ఆంధప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా.. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీ చేశారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్‌ సహా 13 మంది పోటీలో నిలిచారు.

పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ సహా 27 మంది పోటీ చేశారు. తెలంగాణలో ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏబీపీ ` సీ ఓటర్‌ వంద శాతం ఖచ్చితమైన అంచనాలను వెల్లడిరచింది. కాంగ్రెస్‌ పార్టీ 64 అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ ను ఏబీపీ ` సీ ఓటర్‌ నిర్వహించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు భిన్నత్వం ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల ఓటింగ్‌ ప్రయారిటీ అంశాలు మారిపోయాయి. అందుకే ఫలితాల్లోనూ భిన్నత్వం కనిపిస్తోంది. తెలంగాణలో ఏబీపీ ` సీఓటర్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో మొదట ఓట్‌ షేర్‌ను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అత్యధికంగా 52.9 శాతం ఓట్లు సాధిస్తుందని ఏబీపీ న్యూస్‌ ` సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడిరచింది. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి 41.7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

అలాగే వైఎస్‌ షర్మిలా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని కొంత మెరుపరిచారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం కన్నా తక్కువే ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి మెరుగైన ఓట్లు సాధించబోతోంది. ఈ సారి 3.3 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ ` సీఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడిరచింది. ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. సీట్ల ప్రకారం చూస్తే.. 52.9 శాతం ఓట్లు సాధిస్తున్న ఎన్డీఏ కూటమి ఆటోమేటిక్‌ గా స్వీప్‌ చేయంగా కనిపిస్తోంది. మొత్తం ఇరవై ఐదు లోక్‌ సభ సీట్లలో 21 నుంచి 25 సీట్లు కూటమి పార్టీలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీకి 0 నుంచి 4 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అంటే వైఎస్‌ఆర్‌సీపీ ఖచ్చితంగా గెలిచే లోక్‌ సభ సీటు ఒక్కటి కూడా లేదని ఏబీపీ సీఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడిరచింది. ఎబీపీ ` సీఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ పూర్తిగా లోక్‌ సభ నియోజకవర్గాలకు సంబంధించినదే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ లోక్‌ సభ సీట్ల నిష్పత్తిలోనే అసెంబ్లీ సీట్లను కూడా.. కూటమి , వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *