దేశంలో “స్వచ్ఛ భారత్”కు పదేళ్లు గడిచిన లక్ష్యాన్ని చేరలే..
డంపింగ్ సైట్లలోని చెత్తను శాస్త్రీయంగ శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం..
పారిశుద్ధ్య(సఫాయి) కార్మికులు 92 శాతం అణగారిన కులాలవారే..
వీరి వెలకట్టలేని సేవలకు గౌరవం, న్యాయం దక్కాలి..
ప్రజా శ్రేయస్సుకు పరిశుభ్రతే ప్రాణ ప్రధానం ఇది సమిష్టి బాధ్యత..
మన దేశ ప్రజానీకం ఆరోగ్యంగా, ఆనందంగా అస్తరు సెంట్లు చల్లు కొని ఆదామరిచి నిద్రిస్తుంటే.. పారిశుద్ధ్య (సఫాయి )కార్మికులు కోడికూత పొద్దున్నే నిద్ర లేచి చెత్త చెదారం, అపరిశుభ్ర పరిసరాలను, దుర్గంధ మయమైన వాసనలను అత్తరు(సెంటు)ల్లా పూసుకుంటూ శుభ్రపరిస్తేనే కదా!. ఉదయానికల్లా అందమైన రోడ్లులు,వాడలు కూడళ్ళు పరిశుభ్రంగా కలకలలాడుచుంటాయి. అలాంటి వారి సేవలు అనన్య సామాన్యం. పాలకులు మారిన, వారి జీతాలు పెంచకున్నారే తప్ప వీరి జీవితాల్లో మార్పులేదు. దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యం ఎంత ప్రధానమో, ప్రజా శ్రేయస్సుకు శుభ్రతతో కూడిన పారిశుద్ధ్యం అంతే ప్రాణప్రదానం అని వందేళ్ళ క్రితమే గాంధీ పిలుపునిచ్చారు.ప్రజారోగ్యం బాగుండాలంటే ఇళ్లూ వాకిళ్లతో పాటు పరిసరాలు, గ్రామాలు, పట్టణాలు,నగరాలు పరిశుభ్రత పైనే ఆధారపడి ఉంటుంది.అంతేకాదు ఇంట్లోని మరుగుదొడ్డి,వంటగది శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధవహించాలని నొక్కి చెప్పాడు. ఆయన ఆవేదనకు మన్నన దక్కడం లేదు.స్వతంత్ర భారతంలో1981నాటికి ఒక్క శాతం గ్రామీణ కుటుంబాలకే పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి.1986లో గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభించారు.1999లో సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమంగా మారింది. 2012 నాటికి అది కాస్త పారిశుద్ధ్య వసతులు ఉన్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7% చేరింది. ఈ నత్త నడక ప్రగతి వేగవంతం చేయడానికి 2014 అక్టోబర్ 2న, “స్వచ్ఛ భారత్”కు శ్రీకారం చుట్టారు నాటి,నేటి ప్రధాని మోడీ. కానీ నిధులు కేటాయించి ప్రచారం, పారిశుద్ధ్య పనులు,మరుగుదొడ్లు నిర్మాణాలో వాడకంలో కొంత మేరకు చైతన్యం వచ్చినప్పటికీ, దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన సమస్యలు తీరనే లేదు.
“స్వచ్ఛభారత్” కింద నిర్మాణాల నాణ్యత పై పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ మధ్యనే అసంతృప్తిని వ్యక్తపరిచింది. గ్రామీణ ప్రాంతాలలో టాయిలెట్ల వాడకం తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ అధ్యయనం కమిటీ నిరుడు పేర్కొంది.స్వచ్ఛభారత్ లక్ష్యాలు ఇంకా సంపూర్ణంగాసాధించ లేదనేది వాస్తవం.కానీ మన ప్రధానమంత్రి ఈమధ్య “అక్టోబర్ 2,గాంధీ జయంతి”రోజు స్వేచ్ఛ భారత్ కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉద్యమం విజయవంతం అయిందని పాఠశాలలో పిల్లలతోపాటు చీపురు పట్టి ఊడుస్తూ ప్రచారం చేశారు.ఈవిజయవంతానికి ప్రధాన భూమిక పోషించిన పారిశుద్ధ్య (సఫాయి) కార్మికుల మురికి జీవితాల్లో వెలుగులు నింప లేదనేది వాస్తవం. నగరాల్లో ,పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంపింగ్ సైట్లకు చేరుస్తున్నారు. ఇలా గుట్టలు గుట్టలుగా పోగయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేయాలన్న ఆశయాలు నెరవేరడం లేదు.ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో విస్తరించిన 2411డంపింగ్ సైట్లను శుభ్రం చేయాలి. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో చెత్త సేకరణ, విభజన,జరిగినప్పటికీ పునశ్శుది చేయడంలో పాలకుల చిత్తశుద్ధి లోపిస్తుంది.మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల మురికి బతుకుల్లో ఆర్థిక పరిస్థితి మారడం లేదు. తరతరాలుగా కొన్ని అట్టడుగు,అణగారిన సామాజిక వర్గాల వారే ఈ పనులను చేస్తున్నారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. “స్వచ్ఛభారత్” కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని దేశ ప్రజలంతా ఆద మరిచి నిద్రపోతున్న వేళ వేకువజామునే లేచి అపరిశుభ్ర పరిసరాలలోని చెత్తలను, దుర్గంధాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య(సఫాయి)కార్మికుల మురికి బతుకల్లో వెలుగులు రాలేదు.గ్రామాల్లో,పట్టణాల్లో,నగరాల్లో,మహానగరాల్లో పారిశుద్ధ్య మురికి పనులు చేస్తున్న కార్మికులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే 92 శాతానికి పైగా ఉన్నారు.మురుగు నీరు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే సఫాయి(కార్మికు)లు అధిక భాగం వారే ఉన్నారు. భారత్లోని నగరాలు, పట్టణాల నుంచి ప్రభుత్వ సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ) నుంచి 3వేలకు పైగా పట్టణ, నగరపాలక సంస్థల్లో ఉన్న 38వేల మంది కార్మికుల్లో 91.9 శాతంమంది ఎస్సీ ,ఎస్టీ, ఓబీసీల నుంచే ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గం నుంచి అధికంగా 68.9శాతంమంది ఉండగా, 14.7 శాతం మంది ఓబీసీలు, 8.3 శాతం మంది ఎస్టీలు ఉన్నారు. 8శాతం మంది జనరల్ కేటగిరి నుంచి ఉన్నారు.దేశవ్యాప్తంగా 2019 నుంచి 2023 మధ్య ప్రమాదకర పరిస్థితుల్లో మురుగు కాల్వలను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తూ 377 మంది చనిపోయారని పార్లమెంటులో ప్రభుత్వం సమాచారాన్ని వెల్లడించింది. తరతరాలుగా పారిశుధ్య కార్మికుల మురికి బతుకులను ప్రజా పాలనలో కూడా మార్చలేకపో పోతున్నారు. కానీ “స్వచ్ఛ భారత్ “పేరుతో ప్రచారం పొందడం కోసం పారిశుద్ధ్య మురికి సఫాయి( కార్మికు)ల కాళ్లు కడిగి ఆ నీళ్లని తలపై చల్లు కోవడం పాలకులు మానవీయతకు నిదర్శనం. వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశుధ్య కార్మికుల చేసే పనుల్లో ఎన్నో నూతన యంత్రాలను ప్రవేశింపజేసి వారికి ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. పాలకులు వారి వేతనాలుపెంచి ఆ వృత్తి పట్ల గౌరవం,భరోసా,భద్రతకల్పించి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలి. పారిశుద్ధ్య (సఫాయి) కార్మికులు యాచకులు కాదు?.వారి వెల కట్ట లేని శ్రమ శక్తిని గుర్తించి న్యాయం చేయాలి.
మేకిరి దామోదర్,
సోషల్ అనలిస్ట్,
9573666650.