గండిపడిన జీవితాల ప్రతిబింబం ‘చెరువు గండి’ నవల

వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి “చెరువు గండి” నవలలోని వాస్తవ చిత్రంలోకి తొంగిచూస్తే, చరిత్ర పేజీలు మోస్తున్న నిమ్న కులాల రక్తపు కన్నీళ్లు దీనంగా కనిపిస్తున్నాయి. తడి ఆరని కనురెప్పల మధ్య దుఃఖపు మంచుతెరలను మోస్తున్న ఆ జ్ఞాపకాలను మెల్లగా తాకితే, అవి మాట్లాడటం మొదలుపెట్టాయి. ‘స్వతంత్రం, దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అని దోబూచులాడుతున్న రోజులవి…’ అనే వాక్యాలతో ‘చెరువు గండి’ నవల ప్రారంభమవుతుంది. __________________ ప్రజాస్వామ్యం, లౌకిక, మానవీయ విలువలకు ఇంకా […]

More

ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని గుర్తు తెచ్చే కథలు

మహిళా ఇంజినీర్లు అరుదుగా కనిపించిన కాలంలో, ఏకంగా రహదారులు-భవనాల శాఖలో ఇంజినీరుగా పని చేసి, తన ఆధ్వర్యంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేయించారు పసుమర్తి పద్మజ వాణి. అక్కడితో ఊరుకుంటే ఈమెని గురించి ఎక్కువమందికి తెలియకపోను. ఆ రోడ్డు నిర్మాణ అనుభవాలకి ఇతరత్రా ఆలోచనల్ని జతచేసి కవిత్వంగానూ, కథలుగానూ మలిచారు. ఎప్ప్పుడో 1981 లో మొదలు పెట్టి 2011 వరకూ అప్పుడొకటి ఇప్పుడొకటిగా రాస్తూ వచ్చిన తొమ్మిది కథలని కలిపి మొన్నీమధ్యనే ‘బతుకు రాదారిలో..’ పేరిట కథాసంపుటి […]

More

నూతన ఒరవడిలో వెలువడిన ‘ట్రావలాగ్’ నవల – ఘాంద్రుక్

ముప్పై ముప్పై ఐదు ఏండ్ల సిద్ధార్థ అనే యువకుడు మరో ఇద్ధరు మిత్రులతో కలిసి ఇరవై ఐదవ ఏట ‘జస్ట్ ఇంటెలిజెన్స్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి, దశాబ్ధకాలంలో దానిని ప్రపంచస్థాయి సంస్థగా అభివృద్ధి చేస్తాడు. వేల కోట్లు ఆర్జిస్తాడు. అంతర్జాతీయంగా పేరు మోసిన కంపెనీలను ఢీ కొట్టే స్థాయికి చేరుకుంటాడు. గెలుపు రుచి మరిగిన అతను అటువంటి స్టార్ట్ అప్ సంస్థలకు పెట్టుబడి పెట్టే ఓవ్యక్తి చేతిలో దారుణంగా వంచించబడతాడు. అనూహ్యంగా అతనికి ఎనభైశాతం షేర్లతో […]

More

ఒక రైతు ప్రేమికుడి కవితాగానం ‘మట్టి మట్టి’

“ఎన్నాళ్లు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం” “నేలను రైతన్న దున్నినంత కాలం మెతుకు మీద మనిషి బతికినంత కాలం” తెలుగు కవిత్వంతో పరిచయమున్నవారికి ఈ కవిత్వ పాదాలు నినాదాలుగా గుర్తుండి పోయాయి. కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న ప్రగతిశీల కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. నిర్విరామంగా కవిత్వంతో కరచాలనం చేస్తూ మనందరినీ పలకరిస్తుంటారు. కళ్ళ ముందు జరిగే ప్రతి అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రశ్నించకుండా ఉండలేరు. కాలానికి నిలబడిన కవిత్వాన్ని రాస్తున్న అతి కొద్దిమంది ఆధునిక తెలుగు కవుల్లో ఆయన […]

More

అలసిన మనసులకు అక్షర లేపనం – ‘సృష్టి’

సృష్టి…తయారు చేయడం చతుశ్శష్టి కళలుగా చెప్పబడుతున్న సృజనాత్మక క్రియలన్నీ సృష్టిని సూచిస్తాయి. మరి మనిషితో సహా ఈ చరాచర సృష్టిని ఎవరు పుట్టించారు? స్టీఫెన్ హాకింగ్ చెప్పే పేరు లేని, రూపం లేని ఒక పరమాద్భుత సంయమన సూత్రం కాదా! ప్రపంచమంతా శబ్దాల హోరులో మైమరచిపోతుంటే కవి బి.వి.వి.ప్రసాద్ ఆలోచనల నడుమ విరామం యొక్క రూపాన్ని కళ్ళారా దర్శించారు. కన్నీళ్లు, కేరింతల నడుమ అభావస్థితిని అనుభవించినట్టున్నారు. ____________________ సృజనతో పాటు అనువాదం కూడా చేయగల కృత్రిమ మేధ […]

More

మనువు నుండి నూతన మానవుడి వైపు…

“ది పర్సనల్ ఈజ్ పొలిటికల్” అంటుంది స్త్రీవాద కార్యకర్త కరోల్ హానిష్. “రణ రంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో” అంటారు శ్రీశ్రీ. ఈ రెండు ఉదాహరణలకు ఏమిటీ సంబంధం? అది తెలుసుకోవాలంటే గీతాంజలి ఇల్లొక రాజకీయం చదవాలి. వ్యక్తిగతం కూడా రాజకీయమే అయినప్పుడు రాజకీయమంతా రణరంగమే. కనుక రాజకీయమైన రణరంగమంతా వ్యక్తిగతమే. ఆ వ్యక్తిగతానికి మరొక పేరు ఇల్లు. అవును ఇల్లొక రాజకీయం. డాక్టర్ గీతాంజలి “ఇల్లోక […]

More

ఒకే ఒక్క ఓల్గా!

ఆదర్శాలు, ఆశయాలు, అభ్యుదయాలు అన్నీ ఆడ-మగ విభజన దగ్గర తేలిపోయేవేనని తన ప్రయాణం ప్రారంభంలోనే గ్రహించింది ఓల్గా. ఆ గమనింపే ఆమె గమనాన్ని నిర్దేశించింది. తన గమ్యాన్ని సూచించింది. ఆ పై ఎన్ని అవరోధాలు, అవమానాలు, వ్యక్తిత్వ హననాలు రుచి చూసినా బెదరలేదు. వెనుతిరగలేదు‌. అవన్నీ – స్త్రీ సొంత ఆలోచనను నిరోధించే రాజకీయమని గుర్తించింది‌. కనుకే first of its kind అనిపించే అనేక రచనలకు ఆద్యురాలయింది. ఎనభైయవ దశకంలో అప్పుడప్పుడే పాశ్చాత్య ఫెమినిజం ఉద్యమాన్ని […]

More

చైతన్య స్ఫూర్తిని నింపే తెలుగు తేజస్సు

డా. వూటుకూరి వరప్రసాద్ గారు మంచి కవి, విమర్శకులు. అంతకుమించి ఉత్తమ ఉపాధ్యాయులు, వీటన్నింటికీ మించి దైవ భక్తులు. మనిషిని ప్రేమిస్తారు. ఆయనతో కాసేపు మాట్లాడితే మనసంతా హాయిగా ఉంటుంది. దానికి కారణం ఆయన మాటల్లోని స్వచ్ఛత. ఆయన కవిత్వం చదివినా, ఆయన వ్యాసాలు చదివినా అంతే ఆనందాన్నీ, విజ్ఞానాన్నీ కలిగిస్తాయి. ఆయన అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నారు. కవులు, సాహితీవేత్తలు, వైద్యులు, వివిధ రంగాలలో పనిచేసిన గొప్ప వాళ్ళలో కొంతమంది గురించి […]

More

పాఠకుల పిడికెడు గుండెను దుఃఖ దగ్ధం చేసే అక్షర క్షిపణి – ‘కోకొరో’ నవల

ఈ నవల జపాన్ దేశపు పురాతన, ఆధునిక సంధి కాలంలో సోసెకి నట్సు మే (1867 – 1916) అనే ప్రఖ్యాత జపనీస్ రచయిత తను మధ్య వయసు నుండి వృద్ధాప్యానికి పరివర్తనం చెందే సంధి వయసులో 1914లో తన మరణానికి రెండు సంవత్సరాల ముందు వ్రాశాడు. ఆయన మరణించిన ఇరవై ఏడు ఏండ్ల తరువాత 1941లో మొట్ట మొదటిసారిగా ఆంగ్లభాషలోకి అనువాదమైన ఈ నవల, తరువాత 1957 మరియు 2020 లో పునర్ముద్రణ కొచ్చింది. అదేవిధంగా […]

More

ఏకత్వం నుండి అనేకత్వానికి – రాగ ప్రస్తారం డా॥ ఎన్.గోపి ‘మగ్న సంగీతం’

‘కాలాన్ని నిద్రపో’నివ్వని ఈ నాటి మహాకవి, ‘నానీ’ సృజనకర్త. ‘జలగీతం’ కావ్యకర్త డా౹౹ ఎన్.గోపిగారి గురించి పరిచయ వాక్యాలన్నీ – ఒక గ్రంథ పరిచ్ఛేదం అవుతుంది. అందుకనే, స్పష్టాతిస్పష్టంగా – ‘నన్ను తెలుసుకోవాలంటే/ నా కవిత్వంతోనే / బయోడేటా వేస్ట్’ అనేశారు ‘పెహ్చెన్’ కవితలో. డా౹౹గోపిగారి 31వ కవితా సంపుటి- ‘మగ్న సంగీతం’ ఈ ఏటి కవిత్వ ఫలసాయం. _________________ కవి నిమగ్నం కావటమంటే, సమష్టి తత్త్వంలో లీనమవుతూ ఆ సమష్టికి కవిత్వంలో ప్రాణప్రతిష్ట చేయటమే. ‘మగ్న […]

More