వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మేకర్స్ రెగ్యులర్ అప్డేట్లతో ముందుకు వస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్‌గా వుంది. ఈ యూనిక్ అడ్రినలిన్‌తో నిండిన అడ్వంచర్‌లో క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ వున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.