ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో రాసిన కవిత్వాన్ని (2010 – 2024) ‘తెలంగాణి’ కైతల దొంతులు పేరుతో పుస్తకంగా ప్రచురించారు. రేపు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క ఆవిష్కరిస్తారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సాహిత్య సభకు వి సి కె రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారు.ఈ సభలో విశిష్ట అతిధులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బి.ఎస్.రాములు, ప్రొ.కంచ ఐలయ్య, ప్రొ.సూర్యధనుంజయ, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు,కొండవీటి సత్యవతి,డాక్టర్ గోగు శ్యామల,డాక్టర్ కోయి కోటేశ్వరరావు, కనీజ్ ఫాతిమా,దాసోజు లలిత,స్వేచ్ఛ మొదలగు వారు పాల్గొంటారు.
నిర్వహణ
మట్టి పూలు,దండోరా పబ్లికేషన్స్