సీఎం జగన్ శనివారం భీమిలీలో తాము సిద్ధం అంటూ ఎన్నికల నగారా మోగించారు. అత్యంత ఆత్మవిశ్వాసం తాము ఒంటరిగా పోటీ చేస్తామని 175 అసెంబ్లీ,25ఎంపీ స్థానాలకూ పోటీ చేస్తామన్నారు. నా ప్రజల్లో అందరూ సేనాధిపతల్లా కనిపిస్తున్నారని వారు తప్పక ఎన్నికల యుద్ధంలో విజయం తీసుకువస్తారని అనడం వారికిధైర్యం కల్పించడమే. మాదిపాండవసైన్యమని,తమకు కృష్ణుడు వంటి ప్రజల మద్దతు ఉందనడం,ప్రతిపక్షాలను కౌరవసైన్యంతో పోల్చడం ప్రజలను ఆకట్టుకునే జిమ్మిక్కులు వాడారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయాలంటే భయంతో దత్తపుత్రుడితో చెట్టాపట్టాలువేసుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేయడం తన పార్టీని పొగుడుకోవడం కనిపించింది. రాబోయే 60,70రోజుల్లో ఎన్నికలు వస్తాయని, గెలుపు బాధ్యత పార్టీనాయకులదే భారం వారిమీద వేశారు. ఇంటింటికి వెళ్లి మనం ఇచ్చి హామీలు 99శాతం నెరవేర్చామని,గతంలో బాబు 10శాతం హామీలు కూడా నేరవేర్చలేదని ప్రచారం చేయాలన్నారు. తమ ప్రభుత్వం 56నెలల్లో అభివృద్ధి,సంక్షేమం గూర్చి చెప్పాలన్నారు. గజదొంగల ముఠాను ఒడించడానికి సిద్ధంకావాలని పిలుపునివ్వడం తాము స్వచ్ఛమైననాయకులమని చెప్పుకున్నారు.. ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని ఈ సారి 23స్థానాలుకూడా రాకుండా చేయాలని అత్యాశగా కనిపించింది. దేవుడు,ప్రజల అండదండలు ఉన్న మీ బిడ్డ భయపడడని ప్రకటన వెనుక భయం కనిపిస్తోంది. గత వారంలో ఒక ఇంటర్వ్యూలో ఓటమిపై వ్యాఖ్యానించారు. అధికారం పోయినా తాను భయపడని చెప్పడం, ఇప్పుడు అసలు భయము లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మాకు పోటీ టీడీపీ-జనసేన అన్న నోటితోనే వారికి ఒక్క సీటుకూడా రాదనిచెప్పడం కార్యకర్తలను ప్రభావితం చేసేందుకే నని అర్ధమవుతున్నది.నేను సిద్ధం,మీరు సిద్ధమా అనడం నా వెంట రావాలని చెప్పడమే.గెలిచే దమ్ములేని కాంగ్రెస్ కుటుంబాలను చీల్చు తున్నదని,కేవలం తన సోదరిని తనమీద ప్రయోగించిందని విమర్శించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పదేపదే నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పారు.ఇటీవల సర్వే చేయించి మార్చిన స్థానాలతో పార్టీలో గందరగోళమైన పరిస్థితి ఏర్పవడం కూడా వైసీపీకి కొంత ఆశాభంగమేననాలి.
ఇదిలా ఉండగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మీ పార్టీ జగన్ పార్టీ మాత్రమేనన్నారు. మీ పార్టీలో వైఎస్ ఆర్ లేడన్నారు. ఉన్నది వివి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి,రామకృష్ణారెడ్డి మాత్రమే నన్నారు.బీజేపీకి ఈ పార్టీ బానిసత్వం అని విమర్శించారు. ఏపేలో ఉన్నమూడు పార్టీలు బీజేపీకి బానిసపార్టీలేనన్నారు.జగన్ రెడ్డి ప్రత్యేక హోదానూ వదిలేశారు. 8లక్షల కోట్లాది అప్పు చేసిన వైసీపీ ఏమి చేసిందని విమర్శించారు.పోలవరంవదిలేశారు.రాజధాని కట్టలేదు. ఏమి చేశారన్నారు.తానూ వైఎస్ బిడ్డనే నని,ఆ రక్తము నాలోనూ ఉందని పరోక్షంగా అన్నకు సవాలు విసిరారు.అన్నా చెల్లెలు మధ్య వాగ్బాణాలు తీవ్రం అయ్యాయి.ముఖ్యంగా షర్మిల వైసీపీని మాటలతో తూట్లు పొడవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆనందంగా ఉంది.మళ్లీ గతవైభవంవస్తుందని ఆశతో ఉన్నారు.షర్మిల రాష్ట్రంలో పర్యటించి పార్టీని ఉత్సాహపరుస్తున్నారు. రాబోయే ఎన్నికలు ఎలాంటి మలుపు తీస్తాయో చూడాలి.