సుహాస్‌ ‘జనక అయితే గనక’ టీజర్‌ రిలీజ్‌

సినిమా

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం జనక అయితే గనక’. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్‌ మీ వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ తర్వాత ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఈ టీజర్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ ఇలా అన్ని అంశాలు సరైన పాళ్లలో ఉన్నాయని ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం టీజర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీని త్వరలోనే రిలీజ్‌ చేయబోతోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *