నేలమీద నిలబడే కవిత్వం

సాహిత్యం పట్ల అభిరుచితోపాటు సృజనాత్మకతనూ అలవరుచుకున్న సున్నిత మనస్కుడు అవధానుల మణిబాబు. విశ్లేషణ నుంచి విమర్శనాత్మకంగా ఆలోచించేటందుకు బహుగ్రంథ పఠనం అవసరం. అలా చదవడంతో పాటు తులనాత్మక పరిశీలన కూడా మణిబాబు సొంతం చేసుకున్నారు. పిన్నవయసు నుండే ప్రసిద్ధ రచయితల సామీప్యంలో, సాన్నిహిత్యంలో తనను తాను మలచుకున్నారు. చదువరి సృజనాత్మకతను పరిరక్షించేది స్పందించే హృదయమే అనడంలో అతిశయోక్తి లేదు కదా! అలా మణిబాబు తనతో తాను, తనలో తాను నిరంతరం సంభాషించే సంపూర్ణ సాహిత్య పిపాసి. సముద్రంతో […]

More