ప్రాచీన సాహిత్య పునాదులమీదే ఆధునిక సాహిత్యం వికసించిందని గుర్తెరగాలి

మాతభాష, మాతమూర్తి, మాతభూమి ఎన్నటికీ విస్మరించరానివి ఆచార్యునిగా, కవయిత్రిగా, రచయిత్రిగా, వ్యాఖ్యాన కర్తగా, ప్రవచన కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న ఆచార్య వెలువోలు నాగరాజ్య లక్ష్మితో ఈవారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి? గుంటూరు జిల్లాలోని అమతలూరులో మా స్వగ్రామంలో పుట్టాను. అయితే మాది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోని కొత్తూరుకు వలస వెళ్ళిన కారణంగా నా బాల్యం అక్కడే గడిచింది. నా పాఠశాల విద్యాభ్యాసం మా ఊరికి 6 […]

More

సర్రియలిస్ట్ నవలకి నోబెల్ సాహిత్య బహుమతి

“జీవిస్తున్నది శరీరం మాత్రమే! ఆత్మ ఎప్పుడో మరణించింది. లొంగిపోతున్నది శరీరం మాత్రమే ! ఆత్మ విభేదిస్తూనే వుంది” (2024వ సంవత్సరపు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత హాన్ కాంగ్ “ది వెజిటేరియన్” నుండి.) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అకాడమీ ఈ సంవత్సరం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ కి సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. యాభయ్ మూడేళ్ళ హాన్ నోబెల్ బహుమతి పొందిన మొదటి కొరియన్. “చారిత్రక దుఃఖాన్ని, వేదనను,గాయాలను విశదపరచే క్రమంలో కనిపించే […]

More

పదుగురికి మేలు చేసే సాహిత్యం కావాలి- ఈతకోట సుబ్బారావు

కవి,కథకుడు,చరిత్రకారుడు,సంపాదకుడు ఈతకోట సుబ్బారావు. విభిన్నాంశాలపై సంఘటనాత్మకం, సందర్భానుసారంగా తన సంస్పందనల్ని సంపాదకీయాలుగా విశాలాక్షి మాసపత్రికలో రాస్తున్నారు. వాటిలో కొన్నిటిని ‘విశాల నయనం’ పేరుతో కవిత్వ సంపుటిగా వెలువరించారు. ఈ సంపుటిలోని కవితలు పదునైన అభివ్యక్తితో సాంద్రత,గాఢతతో వెలువరించడం మెచ్చుకోదగినది. సాహిత్య పత్రికలలో ఏ పత్రిక కూడా తమ సంపాదకీయాలను వచన కవిత్వంలో రాయలేదు. ఇది ఒక చరిత్ర. ఒక పత్రిక యొక్క ప్రయాణంలో ఇది చెప్పుకోదగిన మలుపు. ఈతకోట.. కథ రాసినా,కవిత రాసినా,చరిత్రకు సంబంధించిన వ్యాసం రాసినా,విలేకరిగా […]

More

నాటక సాహిత్యానికి చెరగని సంతకం శ్రీశ్రీ

 శ్రీశ్రీ మహాకవి మాత్రమే కాదు..గొప్ప నాటకకర్త కూడా. నాటక శాస్త్రాన్ని, నాటక తత్వాన్ని, నాటక ప్రయోజనాన్ని సంపూర్ణంగా ఆకలింపుచేసుకొని, నాటక అస్తిత్వాన్ని అపూర్వంగా ఆవిష్కరించిన గొప్ప మేథావి శ్రీశ్రీ. ఆయన కలంనుంచి జాలువారిన అన్ని నాటికలు ఆణిముత్యాలే. ఆ నాటికలలోని ఇతివృత్తాలన్నీ సాధారణ ప్రజల జీవితాలతో ముడిపడివున్న కథాంశాలు మాత్రమే. కథ, కథనం, శిల్పం, సన్నివేశాలు, సంభాషణలు, సందేశాలు.. ఏవీకూడా కృత్రిమంగా కనిపించవు… అన్నీ సజీవ స్వరూపాలే.. మెదళ్లకు కదలిక కలిగించే మేనుపర్వతాలే. ఆసక్తికరమైన సన్నివేశాలతో, శ్రోతలను […]

More

తెలుగు సాహిత్యంలో అమావాస్య ఎరుగని చంద్రుడు ‘బుచ్చిబాబు’

తెలుగు కథా, నవలిక సాహిత్య వైభవానికి స్వర్ణాభరణాలు అందించిన అరుదైన అక్షర నిరంతర సాధకుడు ‘బుచ్చిబాబు’. సాహిత్య చరిత్ర పుటలలో చిరస్థాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ‘బుచ్చిబాబు’..తెలుగుభాషతోపాటు ఆంగ్లభాషలో సైతం సారవంతమైన రచనా చమత్కారాన్ని తన అరచేతి గీతలుగా మార్చుకున్న సాహిత్య తపస్వి ఆయన. తన మనసు స్పందించే సవ్వడుల తరంగాలకు సరిగమలు నేర్పి, ఆ రాగాలనే నేర్పుగా అక్షరాల ఆకృతులలోకి తర్జుమాచేసి, తన మాతృభాషలో మహోత్తరమైన పసిడి వెలుగుల సాహిత్యపు వెన్నెలను, వెన్నలాగా పాఠకులకు […]

More

అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం

జాతీయ పురస్కారాలకు ఆహ్వానం భోపాల్‌ కేంద్రంగా సుమారు అరవై ఏళ్లుగా పనిచేస్తున్న అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం , శ్రీమతి సుమన్‌ చతుర్వేది మెమోరియల్‌ ట్రస్ట్‌ , జాతీయ పురస్కార సభ , కావ్య గోష్ఠికి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, హిందీ రచయితల పేర్లు ఆహ్వానింప బడుతున్నాయి. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం, శ్రీమతి సుమన్‌ చతుర్వేది మెమోరియల్‌ ట్రస్ట్‌ వారి జాతీయ పురస్కార సభ (2022-23), కావ్య గోష్ఠి 2024 ఫిబ్రవరి నెల , […]

More

అనువాద సాహిత్యానికి అందిన అరుదైన సత్కారం

నేడు వాడుకలో వున్న రైల్వే రిజర్వేషన్ రూపకల్పనలో ముఖ్యభూమిక వహించిన ముకుంద రామారావు .. బహుళ జాతీయ సాఫ్ట్వేర్ వ్యవస్థలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనువాద రంగంలో వీరి కృషి అనితరసాధ్యం. ‘అదేగాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు’… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి తెలుగువారు ఆస్వాదించడానికి బృహత్ గ్రంథాలు వెలువరించారు. “శతాబ్దాల సూఫీ కవిత్వం” ద్వారా సూఫీ తత్త్వసారాన్ని తెలుగులోకి వడగట్టి […]

More

ఏ గొప్ప సాహిత్యానికైనా జీవితమే ముడి సరుకు

యువతరం పాఠకుల్ని, రచయితల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రెండు కార్యక్రమాలు చేపట్టింది. మొదటిది ఈతరం కోసం కథాస్రవంతి. కథాసాహిత్యంలో పేరెన్నికగన్న కథకుల సంపుటాలు ప్రచురించడం. రెండవది యువ రచయితలను ప్రోత్సహించేలా కథల పోటీ నిర్వహించడం. పది, పన్నెండు కథలకు పరిమితంజేసి నేటికి నలభై మూడు కథాసంపుటాలు అరసం ప్రచురించింది. ‘అరసం యువ కథాపురస్కారం’ 2021, 2022 సంవత్సరాలలో పోటీలు పెట్టి పదిమంది కథకులకు బహుమతులిచ్చి, ఆయా కథలను ప్రచురింపజేసింది. ‘2022 అరసం యువ […]

More