వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల సంపుటి ‘మూడు గుడిసెల పల్లె.’ ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన పదిహేను కథల సమాహారమిది. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. […]

More

ఊరు భాషే నాకు శ్వాస-అన్నవరం దేవేందర్

రూపం సాధారణం, కవిత్వం అమోఘం కలిస్తే అన్నవరం దేవేందర్. సామాజిక సమస్యలనే తన చింతనగా, సమాజంలో బాధ్యతాయుత పౌరుడుగా, ప్రభుత్వ ఉద్యోగిగా, పాత్రికేయుడుగా బహుముఖీయతను కలిగిన వ్యక్తి. ఆ బహుముఖీయతనే తన రచనల్లో కూడా ప్రతిబింబింప చేసాడు. దేశానికి అన్నం పెట్టి, తాను మాత్రం ఉరితాళ్ళను ఎక్కిన రైతుల బాధలను, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను, దొరల దౌర్జన్యాలను, దళిత బహుజనుల అస్తిత్వ విధానాలను, భూస్వాములపై విప్లవ నినాదాలను తన కలం గళంతో అక్షరీకరించాడు. తాను చిన్నప్పటి […]

More