వరద నష్టం రూ.5,430 కోట్లు

తెలంగాణ

ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు విపరీతం
వరద బాధితులకు తమ ప్రభుత్వం అండ
సృజనక్రాంతి/ఖమ్మం : వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హావిూ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం.. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తాం. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది మరణించారు. రూ.5,430 కోట్లు నష్టం జరిగిందని అన్నారు. ఇంతటి విపత్తు గతంలో ఎప్పుడూ జరగలేదని, ఖమ్మం విపరీతంగా నష్టపోయిందని అన్నారు. ప్రజల ఆస్తులతో పాటు, ప్రభుత్వ ఆస్తులను విపరతీంగా నష్టపోయామని అన్నారు. ఈ విపత్తును జాతీయ విప్తతుగా ప్రకటించాలని అన్నారు. విపత్త నిధి నుంచి సాయం అందించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. ఇకపోతే విపక్షనాయులు బురద రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద బాధితులు సర్వం కోల్పోయారు. వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందిస్తున్నాం. ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం.ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని సిఎం తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు త్వరగా పునరుద్ధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం కేసీఆర్‌ బాధ్యత. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే వెళ్తారు. కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారానే మాట్లాడతారు. కేటీఆర్‌ అమెరికాలో ఉండి.. ఇక్కడ మంత్రులు పట్టించుకోలేదని కేటీఆర్‌ ఎలా చెబుతారు? ప్రజలకు కష్టం వచ్చినా కేసీఆర్‌ స్పందించరు.. పలకరించరు. భారాస నేతల వైఖరి వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. వెంకయ్యనాయుడు ముందుకొచ్చి నైతిక మద్దతు ఇచ్చారు. విపత్తుల వేళ భారాస నేతలు ప్రజలకు చిల్లిగవ్వ ఇవ్వరు. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్‌ పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా విూడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. సాగర్‌ ఎడమ కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కరుణగిరి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. రాజీవ్‌ గృహకల్పలో వరద బాధితులకు రేవంత్‌ పరామర్శించారు. ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జి దగ్గర చిక్కుకున్న 9 మంది..బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో వరదలపై సవిూక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. వరద ప్రజల బతుకుల్లో విషాదం నింపిందని చెప్పారు. ప్రజా కష్టాలు తీర్చేందుకు మంత్రులు, అధికారులు..నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. మంత్రి పొంగులేటి నిరంతర సవిూక్ష చేస్తున్నారని చెప్పారు. వరదను నియంత్రించేందుకు ఖమ్మంలో రీటైనింగ్‌..వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు. రీటైనింగ్‌ వాల్‌ కోసం రూ.650 కోట్లు కేటాయించామని అన్నారు. రీటైనింగ్‌ వాల్‌ పూర్తికాకుండానే ఖమ్మంలో వరదలు వచ్చాయని అన్నారు. 70 ఏళ్లలో 40 సెం.విూ. వర్షాన్ని ఖమ్మం ప్రజలు చూడలేదని చెప్పారు. బాధితులకు నిత్యావసరాలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతటి వరద చూడలేదని మంత్రి పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35అడుగుల మేర ప్రవహించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడు 35అడుగులు మున్నేరు నీటి మట్టం దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం దాటికి వేలకోట్ల నష్టం జరిగిందని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్‌ తెప్పించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. వాతావరణం అనుకూలించక సాధ్యం కాలేదని తెలిపారు. ఈ వరదలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రాణ నష్టనివారణ చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం ప్రాణాలు పెట్టి శ్రమించారు. సీఎం తాత్కాలిక నష్ట పరిహారం ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకుంటాం అని హావిూ ఇచ్చారు.మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరదలకు రూ.వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సీఎం కేంద్రం సాయం కోరదామన్నారు. ప్రతిపక్షాలు చేతనైతే మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలి. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో అతి తక్కువ సమయంలో 46 సెం.విూ వర్షం కురిసింది. 24 గంటల్లో ఖమ్మంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తాం. అన్ని శాఖ సమన్వయంతో సహాయక చర్యలు చేపడతాం. వరద బాధితులు కుదుటపడేంత వరకు అధికార యంత్రాంగం శ్రమించాలని సూచించారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని హావిూ ఇచ్చారు.తక్షణ సహాయం కింద బాధిత కుటుంబాలకురూ. రూ. 10 వేలు ఇస్తున్నామని తెలిపారు. రాజకీయం చేయాలని తాను మాట్లాడటంలేదని చెప్పారు. వరదలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాదంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. శవాల విూద పేలాలు ఎరుకున్నట్లు ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారికి భరోసా ఉండాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇంత భారీ ఎత్తున మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహించలేదని చెప్పారు. చాతనైతే మంచి సూచనలు ఇవ్వండి రెచ్చగొట్టే ప్రయత్నం చెయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. ఖమ్మం జిల్లాలో ఊహించలేని స్థాయిలో నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. ఇరిగేషన్‌ అధికారులు నష్టం అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భరోసా కల్పించారు. మున్నేరుకు ఈసారి కవినివి ఎరగని ప్రళయం వచ్చిపడిరదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది అనుకొని ఊహించని ఉప ద్రవమని తెలిపారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ సమయంలో 47సెం. విూ వర్ష పాతం ఖమ్మంలో కురిసిందని చెప్పారు. రెండంతస్తుల బిల్డింగ్‌?లు కూడా నీట మునిగాయని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఏపీ నుంచి నేవి హెలికాప్టర్‌ తెచ్చే ప్రయత్నం చేశామని అన్నారు. కానీ వాతావరణం అనుకూలించ అది సాధ్యపడలేదని చెప్పారు. దురదృష్టవశాత్తు పాలేరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పేద కుటుంబాల గూడు చెదిరిందని అన్నారు. నష్టం తీవ్రత పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. రోడ్లు డ్యామేజ్‌ అయ్యాయి, పెద్ద ఎత్తున కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. ప్రజలు కుదట పడేవరకూ సహాయక చర్యల అందజేయాల్సి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *