(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి)
ఏపీలో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉన్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కూటమిని గట్టేక్కిస్తుందా అనేది సామాన్యుడికి అనుమానం రావడం సహజం.కాని 2014లో ఈ కూటమే విజయం సాధించింది.బీజేపీ 4 స్థానాలు సాధించింది.టీడీపీ 102స్థానాలు సాధించింది. ఇప్పుడు కూడా గెలుస్తామనే ధీమాతో కూటమి కట్టారు. పవన్ కళ్యాణ్ పట్టువదలక బీజేపీని పొత్తుకు అంగీకరింపచేసారు. వైసీపీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా బీజేపీ కూటమితో జుట్టు కట్టిందని రాష్ట్ర శాఖ పెర్కొంటున్నది.కాని పవన్ ను అడ్డం పెట్టుకొని టీడీపీని కంట్రోల్ చేయాలని బీజేపీ కూటమిలో చేరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.టీడీపీ రాష్ట్రంలో సంస్థాగతంగా పటిష్టమైన పార్టీ.దాన్ని పరిమితం చేయడం అంత సులభం కాదు. ప్రాంతీయ పార్టీలను పెరగనీయకుండా పరిమితం చేయ్యండం బీజేపీ ఆశయం.ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. వాటిని కంట్రోల్ చేసే విషయంగా రాజకీయ వ్యూహాలను పాటించి తమ దోవకు తెచ్చు కోవడమే బీజేపీ లక్ష్యం. అందులో భాగమే కావచ్చు లేదా ఈ అవకాశంతో రాష్ట్రంలో బలం పెంచుకునే ఎత్తుగడ కావచ్చు.బీజేపీ టీడీపీ -జనసేన బలంతోనే గతంలో లాగా కొద్ది స్థానాలు సాధించినా, పార్లమెంటు స్థానాలు ఎక్కువ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నది.రాముడి ఆలయం పేరుతో ఓట్లను కొల్లకొట్టవచ్చు.పొత్తులో భాగంగా బీజేపీ,జనసేన కు 30 అసెంబ్లీ,8 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కేటాయించింది.కూటమికి 53 శాతంఓట్లు పడతాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.వైసీపీకి 39 శాతం ఓట్ల బలం ఉన్నా సీట్లు తక్కువ వస్తాయని చెబుతున్నాయి. కూటమి ఈ నెల 16,17తేదీల్లో చిలకలూరిపేటలో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని టీడీపీ వర్గాలు తెలిపాయి.ఆ సభకు ప్రధాని మోదీ హజరవుతారని చెబుతున్నారు. ఈ సభలో మోదీ ఏపీకి వరాలు ప్రకటించే అవకాశం ఉంది.రాష్ట్రానికి అన్యాయం చేసారనే మోదీ మీద ప్రజలకు అపోహలు ఉన్నాయి.వాటిని పటాపంచలు చేయాల్సిన బాధ్యత ఆయన పై ఉంది. ప్రత్యేక హోదా,విభజన చట్టం అమలు అంశాలపై ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది.ఈ సభలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి నిధుల కేటాయింపు ప్రకటన చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొంటారని భావిస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ ను ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో పవన్,ఆయన పార్టీ బలమైనది గా మారితే భవిష్యత్తులో కంట్రోల్ చేయడం కష్టం అని బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం గా భావించవచ్చు.భవిష్యత్ లో విలీనం ప్రతిపాదించవచ్చు.చిరంజీవికి అలాగే విలీనం తో కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు.వైసీపీ వర్గాలు తామే గెలుస్తామని, తాము బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చామని,టీడీపీ లాగా ఎన్డీఏ లో చేరలేదని,వారితో మాకు ప్రత్యేక మిత్రత్వం, శత్రుత్వం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.పాచిపోయిన లడ్డూ ఇచ్చారని పవన్,మోదీని తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నేడు మళ్ళీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల పొత్తుకు వెళ్ళడం వారికేచెల్లిదని వైసీపీ వర్గాలు విమర్శించాయి.ఏదిఏమైనాఈ మూడు పార్టీ ల కూటమి పై ప్రజాభిమానం ఎంత వరకూ అనేది తెలుసుకోవాలంటే ఎన్నికలు వరకూ ఆగాల్సిందే.
