సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023వ సంవత్సరానికి, వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను కీర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నది. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైనవారు: మునిమడుగుల రాజారావు (ఆధ్యాత్మిక సాహిత్యం), వారణాసి వెంకటేశ్వర్లు (ప్రాచీన సాహిత్యం), కె.హరనాథ్ (సృజనాత్మక సాహిత్యం), సి.ఎస్.రాంబాబు (కాల్పనిక సాహిత్యం), ప్రభాకర్ మందార (అనువాద సాహిత్యం), ఎస్.రఘువర్మ (అనువాదం), గంగిశెట్టి శివకుమార్ (బాలసాహిత్యం), డా.వెలువోలు నాగరాజ్యలక్ష్మి (ఉత్తమ రచయిత్రి), మంగారి హిమజ (ఉత్తమ రచయిత్రి), విల్సన్ రావు కొమ్మవరపు (వచన కవిత), సయ్యద్ హనీఫ్ (వచన కవిత), ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచారి (పద్యరచన), చింతోజు మల్లికార్జునాచారి (పద్యరచన), పిన్నంశెట్టి కిషన్ (కథ), ప్రభాకర్ జైని (నవల), మంగిపూడి రాధిక (హాస్య రచన), జ్యోతిరాణి (వివిధ ప్రక్రియలు), డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు (ఉత్తమ నాటక రచయిత), పి.వెంకటేశ్వరరావు (ఉత్తమ నటుడు), మంగాదేవి (ఉత్తమ నటి), డా.రాయల హరిశ్చంద్ర (నాటకరంగంలో కృషి), డా. చిత్తర్వు మధు (జనరంజక విజ్ఞానం), డా.వి.త్రివేణి (పరిశోధన), ఆచార్య డి.విజయలక్ష్మి (భాషాఛందస్సు), ఆచార్య సిహెచ్.సుశీలమ్మ (సాహిత్య విమర్శ), బులుసు అపర్ణ (అవధానం), అయ్యగారి సీతారత్నం (మహిళాభ్యుదయం), హెచ్.హేమవతి (లలిత సంగీతం), రామలక్ష్మీ రంగాచార్య (శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), కుమారి మంగ్లి (జానపద గాయకులు), పద్మాలయ ఆచార్య (జానపద కళలు), పగిడిపాల ఆంజనేయులు (జీవిత చరిత్ర), పొత్తూరి సుబ్బారావు (పత్రికా రచన), రతన్ కుమార్ (పేరిణి నృత్యం), ఎ.వెంకట రామమోహన చలపతి శాస్త్రి (కూచిపూడి నృత్యం), పాలకుర్తి రామమూర్తి (వ్యక్తిత్వ వికాసం), చెగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (హేతువాద ప్రచారంలో కృషి), ఆచార్య సి.మురళీకృష్ణ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), సుధాకర్ గౌడ్ (గ్రంథాలయకర్త), వి.ఎస్. రాజ్యలక్ష్మి (సాంస్కృతిక సంస్థా నిర్వహణ),డా.ఎస్.మనోహర్ రావు (ఇంద్రజాలం), సుభాని షేక్ (కార్టూనిస్ట్), పండితారాధ్యుల వీరేశలింగం (జ్యోతిషం), పాతూరి మహేందర్ రెడ్డి (ఉత్తమ ఉపాధ్యాయులు), కంది నరసింహులు (చిత్రలేఖనం), నందకిషోర్ (వచన కవిత-45 సం. లోపువారికి), పిల్లిట్ల ముకుందం (జానపద కళలు), ఇరువింటి వెంకటేశ్వర శర్మ (గజల్)లకు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో నందమూరి తారక రామారావు కళామందిరంలో త్వరలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఒక్కొక్కరికి రూ.5,116/-నగదుతో సత్కరిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలియజేశారు.
