క్లుప్తత,సాంద్రత,లోతైన తాత్త్వికతల కలయిక ‘ఏకాంత స్పర్శ’

కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం- మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగలడానికీ వీల్లేదు -కె.శివారెడ్డి కవిత్వంలో వస్తువు, శైలి, అభివ్యక్తితో పాటు క్లుప్తత, సాంద్రతలను సాధించడం కవికి ఒక పెద్ద సవాలు. తక్కువ పదాల్లో ప్రపంచాన్ని చూపించాలంటే వస్తువుపై పూర్తి పట్టు ఉండాలి. చందలూరి నారాయణ రావు తన “ఏకాంత స్పర్శ” కవితా సంపుటి ద్వారా ఈ విద్యను సమర్థవంతంగా ప్రదర్శించారు. పాఠకుడు కవితను చదవడం ముగించిన తర్వాత, అతని అంతరంగంలో అసలైన కవిత మొదలవ్వడమే క్లుప్తత […]

More

‘విస్తార’మైన అవగాహన కలిగించే విమర్శ వ్యాసాలు

విమర్శ రాసేవాళ్ళలో సృజనాత్మక కోణం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ సృజన చేసేవారిలో మాత్రం విమర్శ కోణం ఒకటి తప్పక ఉండాలి. నావకు చుక్కానిలా. అప్పుడే ఏం రాస్తున్నామో? ఎటు వెళ్తున్నామో? అన్న ప్రశ్నలకు విచక్షణతో కూడిన సమాధానం చెప్పుకోగలుగుతారు. లేకపోతే గానుగెద్దు చందంగా అక్కడక్కడే అన్నట్టుగా మిగిలిపోతారు. ________________ నిబద్ధతతో కవిత్వం, కథలు రాస్తూ వస్తున్న రచయితల్లో ఎమ్వీ రామిరెడ్డి ఒకరు. ఆయన ఈ రెండింటి మధ్యలో అప్పుడప్పుడు తనకు నచ్చిన కవితా, కథా సంపుటాలపై […]

More

సమకాలీన కవిత్వానికి సాధికారిక దిక్సూచి ‘చెమట చెక్కిన వాక్యం’

కవిత్వ నిర్వచనం, దాని నిర్మాణం పట్ల ప్రాచీన లాక్షణికుల నుండి ఆధునిక కవుల వరకు కొత్త కొత్త వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. వస్తువుకి అనుగుణమైన రూపాన్నీ, శిల్పాన్నీ ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంతమంది మంచి వస్తువుని తీసుకున్నా, దాన్ని తగిన శిల్పంలో అభివ్యక్తీకరించలేరు. అలాగే, శిల్పం తెలిసినా వస్తువుని దానికి అనుగుణంగా వాడుకోవడం కూడా తెలియని వాళ్ళున్నారు. శిల్పం కోసమో, ప్రయోగం కోసమో రాసే కవులు వస్తువుని నిర్లక్ష్యం చేస్తారు. వీటిని వచన కవిత్వం […]

More

నేల వాసన, మౌన తిరుగుబాటు – పులికంటి కృష్ణారెడ్డి కథల సామాజిక సాక్ష్యం

పులికంటి కృష్ణారెడ్డి తెలుగు సాహిత్యానికి గంభీరతను, మట్టి వాసనను అందించిన విశిష్ట రచయిత. రాయలసీమ జీవన వాస్తవాలు, అక్కడి మనుషుల మానసిక నిర్మాణం, కుల ప్రాతిపదికన జరుగుతున్న ఘోరాలు, ఎండిపోయిన నేలలోనూ మొలిచే మానవత్వం – ఇవన్నీ ఆయన రచనల ప్రధాన బలాలు. రాయలసీమ అనగానే కరువు, హింస మాత్రమే కాదు; అక్కడి అంతర్లీన సంస్కారం, ఆత్మగౌరవం, మౌన విప్లవం కూడా పులికంటి కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఆయన కథలు ప్రాంతీయమైనప్పటికీ సార్వజనీనతను సంతరించుకున్నాయి. ___________________ […]

More

‘ముకుల’ ఒక మెలోడ్రామా

తెలుగు సాహిత్యంలో కుప్పిలి పద్మ పరిచయం అవసరం లేని పేరు. ఆరు కాలాలపాటు నిలిచే ఎన్నో అద్భుతమైన కథలను ఆమె అందించారు. ‘ముకుల’ ఆమె పదవ కథా సంపుటి, మొత్తంగా ఇరవయ్యో పుస్తకం. 2019 నుండి 2024 వరకు ఆమె రాసిన 12 కథలు ఇందులో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కాలపు సామాజిక, మానసిక విచ్ఛిన్నతను, స్త్రీల అభద్రతను, వలసల దుర్భరతను, జాతి ఘర్షణలను ఆవిష్కరించే అరుదైన సంపుటి ఇది. ____________________ ‘ముకుల’ అంటే విరిసీ విరియని […]

More

జలతీగల నాదం మహమూద్ పాషా కవిత్వం

    కొండరాళ్ళని కోమలమైన శిల్పాలుగా మలిచే విద్య తెలిసిన వాళ్ళు కొందరే ఉంటారు. రక్షణ వ్యూహంతో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించే చాతుర్యం ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందినవారే మహమూద్ పాషా. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రముఖ కవి దేవిప్రియ గారు మహమూద్ పాషా ‘ఉనికి’ కవితా సంపుటి గురించి రాస్తూ ‘రేపటికవి’గా ప్రకటించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నలబైయేండ్లుగా తనలోని నిప్పు ఆరిపోకుండా నిరంతరం రాజేసుకుంటూ జ్వాలగా ప్రజ్వరిల్లుతున్న మూడు తరాల […]

More

నాటక సాహిత్యానికి అపురూప రంగుల చిత్రం ‘నాగరాజు గంధం’

నాటకం అంటే మూడు అక్షరాల పదం మాత్రమే కాదు… మానవజాతి మనుగడకు నాలుగు దిక్కులు కలిసి, అఖండమైన ఒక దిక్కుగా మారితే, అదే నాటకమవుతుంది. ఒక పరిపూర్ణమైన తీరానికి మనిషి జీవితాన్ని చేర్చటానికి సిద్ధంగా ఉంచిన ఒక అద్భుతమైన నౌకా నిర్మాణమే నాటకం. మామూలు మనిషిని మహనీయుడిగా, మహనీయుడిని మహాత్మునిగా తీర్చిదిద్దటానికి సకల శాస్త్రాల సారం బడి గంటగా మ్రోగితే, ఆ శబ్దానికి కేంద్రమైన పాఠశాల పేరే నాటకం. నాటకమంటే సమాజ అస్తిత్వ రక్షణ బాధ్యత నాదేనంటూ […]

More

మంచు తెరల మధ్య మనిషి అన్వేషణ – ‘మెరుపు’ నవల

సాహిత్యంలో నోబెల్ బహుమతి అంటేనే ఒక ప్రత్యేకత. కానీ నార్వేజియన్ రచయిత యున్ ఫొస్సా శైలి అంతకంటే విలక్షణమైనది. అతి తక్కువ పదాలతో, అత్యంత లోతైన తాత్వికతను పండించడం ఆయన ప్రత్యేకత. ఆయన ‘మెరుపు’ నవలలో మనం చూసే ‘విరుపు’ (minimalism) తన ప్రతి రచనలోనూ ఒక సంతకంలా కనిపిస్తుంది. ఆయన రాసిన ‘ఎ షైనింగ్’ (A Shining) నవల ఇప్పుడు ‘మెరుపు’ పేరుతో తెలుగులోకి రావడం మన పాఠకులకు ఒక అపురూపమైన అనుభవం. ఆకాశంలో మెరుపు […]

More

హైకూ చేపని పట్టుకోలేని ‘దిగులు కొంగ’

నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే అనేక విషయాల ద్వారా, వివిధ అంశాల నిశిత పరిశీలన ద్వారా, మనకు సిద్ధించే అనుభవ జ్ఞానం ద్వారా లోకంలోని సమస్త వస్తు సంచయాన్ని, జీవితాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థితిలో కవికి ఎదురయ్యే అనుభవాలలో, ఆశ్చర్యాలలో, ఆనంద విషాదాలలో… ఆ దృశ్యానికి ఎలాంటి పటాటోపం లేకుండా, డాంబిక పద ప్రదర్శన లేకుండా, సరళంగా, యథాతథంగా హృదయ సంవేదనకు అక్షర రూపం ఇవ్వడమే హైకూ. ___________________ ‘మనం బతికిన క్షణాల్ని ఇంద్రియ […]

More

జీవిత అర్థహీనతకు అంగీకారం ‘నిర్వేదం’

సాగర్ శ్రీరామకవచం గారు తెలుగు సాహిత్యంలో విస్మరించలేని రచయిత. వారు 14 ఏళ్ల వయసులోనే రచనలు ప్రారంభించి, నవలలు, కవిత్వం, కథ వంటి ప్రక్రియల్లో కృషి చేశారు. సాగర్ రచనలు సామాజిక సమస్యలు, మానవ సంబంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు, ఆధ్యాత్మిక శోధనలు లాంటి అంశాలను బలంగా చర్చిస్తాయి. ఆ కోవలోనిదే “నిర్వేదం” నవల కూడా! ఇదొక మార్మిక గాథ. ఇది మనిషి జీవితంలోని వైఫల్యాలు, నిరాశలు, విరక్తి, ఆధ్యాత్మిక శూన్యతను లోతుగా విశ్లేషిస్తుంది. __________________ అస్తిత్వవాదం, బౌద్ధ […]

More