పసిపాప నిద్రలోని నవ్వును పలకరించిన కవిత్వం

సాహిత్య ప్రక్రియలలో నిగూఢతను కలిగి, సాధారణంగా నడిచే వాక్యాలకు భిన్నంగా మనసును రంజింపజేయటమే కాకుండా ఆలోచింపజేసే శక్తివంతమైన పదాల మోహరింపునే ‘కవిత’ అంటూ ఒక నిర్వచనం తన గొంతును సవరించుకుంటోంది. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వమంటే అక్షర హింస కాదు,అది అక్షర తాండవం. కవిత్వమంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన, ఒక ఆవేశం, ఒక ఆశయం. ఈ సమ్మేళనంలోని తాత్వికతకు హారతుల్లా నిలిచిన అతి కొద్దిమంది కవుల్లో […]

More

జాషువా కవిత్వం విశ్వ మానవతా ప్రకటన

“కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టువడను నేను నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడ నేను” అంటూ విశ్వమానవతను ప్రకటించాడు మహాకవి జాషువా. తాను నమ్మిన విలువల్ని సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. ప్రపంచం తనను ఎలా చూసినా పర్వాలేదు అన్నాడు. పంచముడివి, అంటరానివావిడి అన్నా పట్టించుకోలేదు. కసరి బుస కొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. నేను విశ్వ నరుడను అని ప్రకటించాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించమే […]

More

“కవిత్వమంటే మనసును కదిలించేది”

కవితో కరచాలనం భారత అత్యున్నత న్యాయస్థానంలో గెజిటెడ్ అధికారిగా పదవీ విరమణ పొంది అనువాదకులుగా ప్రసిద్ధి చెందిన ఆర్ ఎస్ వేంకటేశ్వరన్ తో ఈ వారం కరచాలనం.. మీ జీవన రేఖలు వివరించండి? మాతృభాష తమిళమై కేరళలో పుట్టినా, బాల్యం నుంచి పదవతరగతి వరకు బరంపురంలో (ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లా) తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. తరువాత బి.ఎ (ఆనర్స్) కాలేజీలో ఆంగ్ల మాధ్యమంలో చదివినా, తెలుగు ఒక సబ్జెక్టుగా చదివాను. తరువాత ఢిల్లీలో 1984 నుంచి […]

More

క్లుప్తం – భావయుక్తం – లఘురూపం – కవిత్వం

సాహిత్య ప్రక్రియల్లో వినూత్న రీతుల్ని వెంటనే స్వాగతించకపోవడం అనాదిగా వస్తున్నదే! లఘురూప కవిత్వ రీతులను జన సామాన్యానికి చేర్చవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది లఘురూప కవితావేదిక తెలంగాణ విభాగ అధ్యక్షులు, వివిధ లఘురూప కవితల సజన కర్త, సుదీర్ఘ కాలం కవిత్వంలో సంచరిస్తున్న నూతక్కి రాఘవేంద్రరావుతో ఈ వారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి? నా బాల్యం గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, దుగ్గిరాల ఫిర్కా చిలువూరులో, ఆడుతూపాడుతూ సాగింది. మాది చాలా పెద్దకుటుంబం. […]

More

సామాజిక స్పృహ, మానసిక వికాసం, గాఢమైన అభివ్యక్తికి చిరునామా సి.నా.రా కవిత్వం

సామాజికత, అభ్యుదయ కాంక్ష, ప్రాసంగికత వెరసి చిన్ని నారాయణ రావు(సి.నా.రా) కవిత్వపు చిరునామా.వీరు గత మూడు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. వీరి వయసు ఇప్పుడు ఇరవై రెండూ ఇంటూ మూడు.అయినా ఇరవై రెండేళ్ల నవ యవ్వనుడి ఆలోచనలు. ప్రభుత్వాల నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడనప్పుడు, తన స్పందనను తక్షణమే అక్షర రూపంలో అభివ్యక్తీకరించడం వీరి అలవాటు.తన గురువులపట్ల అమితమైన భక్తి పారవశ్యం. అది,సత్యవేటి శ్రీకాంత్ గారైనా, అద్దేపల్లి రామమోహన్ రావు గారైనా, నాగభైరవ కోటేశ్వరరావు గారైనా. గురువులను […]

More

అనుభూతుల అంతర్వాహినికి అక్షర రూపమే కవిత్వం

జీవన స్రవంతికి సమాంతరంగా నిరంతరం లోలోన ప్రవహించే అనుభూతుల అంతర్వాహినికి అక్షర రూపమే కవిత్వం సంఘం పురాతన అనుభవశాలి రేఖాజ్యోతి కవయిత్రి. బాల్యం నుండి వచనకవిత్వమే శ్వాసగా పెరిగారు. రాశిలో తక్కువే అయినా వాసిలో మిన్న. భావ వ్యక్తీకరణలోను మిన్న. అభివ్యక్తిలో తనదైన ముద్ర ఉన్న రచయిత్రిగా విమర్శకులు సంభావిస్తారు. ఈ వారం రేఖాజ్యోతితో ముఖా-ముఖి. మీ బాల్యము విద్యాభ్యాసం గురించి క్లుప్తంగా చెప్పండి. పుట్టింది నెల్లూరులో. బాల్యమంతా నెల్లూరు మాండలికపు మాధుర్యంతోనే మొదలైనప్పటికీ కొంత కాలం […]

More

ఆధునికానంతర అనుభూతి కవిత్వం ‘అనుమంద్రం’

‘అనుమంద్రం’ కవితా సంపుటిని చదివిన తరువాత నాలుగు మాటలు రాయాలనుకోవటం.. ఎలా రాయాలో, అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని కృత్యాద్యవస్థ. ‘అనుమంద్రం’ అనే పదం చూడగానే నాకున్న చిరు సంగీత పరిజ్ఞానానికి మంద్ర, మధ్యమ, తారాస్థాయిలు సంగీతంలో మూడు స్థాయిలుగా ఉంటాయని మాత్రమే తెలుసు. మంద్ర స్థాయి అంటేనే లోగొంతుక. అనుమంద్రం అంటే ఇంకా కిందిస్థాయి. సంగీతంలో అనుమంద్రం, మంద్రం, మధ్యమ, తార, అతి తారా స్థాయులనే పంచస్థాయుల ప్రస్తావన కూడా ఉంది. మంద్రానికి హృదయ […]

More

‘రక్తనాళాల్లోని అలజడుల సవ్వడులు’ బాణాల కవిత్వం

‘జీవితం ముళ్ళపాన్పయినప్పుడు ఓడిపోయిన ఆటల ఆలోచనే వద్దు అన్నిట్నీ అనుభవాల అమ్ముల పొదిలో పొదిగి కొత్త వ్యూహాలకు పురుడు పోయాలి అవమానాల పలుగురాళ్లపై ఆయుధాల్ని సాన పెట్టుకొని అదృశ్య ఆగంతకుని పై గురి పెట్టాలి’ పై వాక్యాలు డా.బాణాల శ్రీనివాసరావు కవితా సంపుటి ‘రాత్రి సింఫని’లోని ‘వ్యూహగామి’ కవితలోనివి. జీవితంలోని అనేక అనుభవాల నుండి పాఠాలను , గుణపాఠాలను నేర్చుకుంటూ నీకు నీవే ఒక వ్యూహకర్తగా మారనంతకాలం మనుగడ ఉండదని హెచ్చరిస్తున్నది. ప్రముఖ కవి డాక్టర్ బాణాల […]

More

జీవితాన్ని ఒక నిరంతర కవితా ప్రవాహం చేసిన మహోదాత్త కవి ఎన్.గోపి

వస్తువు, అభివ్యక్తుల్లో ఒక కొత్త శక్తినేదో తీసుకొస్తూ నిత్యం ప్రవహించే కవి డా.ఎన్.గోపి. అయినా కవిత్వాన్ని ఎంత బాగా రాస్తారో, అంత అందంగా పుస్తకాల్ని కూడా ప్రచురిస్తారు. ‘గోపి కవిత్వం’ పేరుతో వచ్చిన మూడు సంపుటాల్ని పరిశీలించినప్పుడు, ఒక్కొక్క కవితకు చెప్పిన నేపథ్యాల్ని చదివితే ఆయన ఆత్మ కథాత్మక గేయాల్ని చదువుతున్నామేమో అనిపిస్తుంది. కానీ, ప్రతి కవితనూ ఆ నేపథ్యాన్ని వదిలేసి చదివితే అది మన జీవితమే అనిపిస్తుంది. కవిత్వంలో ఉండవలసిన లక్షణాల్లో పాఠకుడు ఆ కవితలను […]

More

కవిత్వాన్ని కప్పుకునే వస్తువు

కవులు స్మృతుల్లో తిరగాడుతుండడం కొత్త కాదు. అసలు కవిత్వానికి ఆరంభ బిందువే స్మృతి. అది వ్యక్తుల స్పూర్తి కావచ్చు, ప్రాంతాల స్మృతి కావచ్చు. బాల్య స్మృతి మీద కవిత్వం రాయని సాహిత్యకారుడు ఏ భాషలోనూ ఉండడు. ఆ మాటకొస్తే ప్రతి ఆధునిక తెలుగు కవి తమ ఊరిని గురించి, తమ బాల్యం గురించి రాశారు. ప్రత్యేకంగా తమ ఊరి గురించి ఒక కావ్యం రాసిన వాళ్లు కూడా ఉన్నారు. అలా రాసిన వాళ్ళల్లో ఎన్ గోపి, ఆ […]

More