Monday, 3 August 2026
ఆంధ్రప్రదేశ్

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం

· · 1 నిమిషం చదవండి

అధికారులకు దిశానిర్దేశం చేసిన సిఎం చంద్రబాబు
అమరావతి : అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్‌టీజీఎస్‌లో డేటా ఆధారిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు సోమవారం సవిÖక్ష సమావేశం నిర్వహించారు. డేటా డ్రివెన్ మేకింగ్ డెసిషన్‌పై అధికారులకు సీఎం మార్గనిర్దేశర చేశారు. సీఎం సవిÖక్షకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఐటీ, ఆర్‌టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి సవిÖక్షించారు. ఆర్‌టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలతో డేటా వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇకపోతే కేందప్రభుత్వం రాష్టాన్రికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించారని వెల్లడించారు. రాష్ట్ర పన్నుల వాటాను కేందప్రభుత్వం సకాలంలో కేటాయించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అదనపు పన్నుల వాటా విడుదలతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతున్నాయని ఉద్ఘాటించారు. కేందప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతగానో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *