సింగరేణికి డీప్‌సైడ్ కోల్ బ్లాక్ సంతోషకరం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ : డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికు లకు, కార్మికుల కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు, సింగరేణి అధికారులకు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల.. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల `2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో.. ఖఐక్షఅ`2 డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యÖనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయని ప్రస్తావించారు. ఖఐక్షఅ`2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్నిరకాలుగా బాధ్యత వహించానని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగానే కాకుండా తెలంగాణ బిడ్డగా.. సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి, సింగరేణి కార్మికులను ప్రేమించే వ్యక్తిగా ప్రత్యేక కృషి చేశానని చెప్ప్పుకొచ్చారు. తన సహకారం ఫలితంగా సింగరేణి విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సోమవారం వేలం పక్రియ పూర్తయిపోయిందని వెల్లడించారు. ఈ విధానంలో సింగరేణి సంస్థకు మణుగూరు ఖఐక్షఅ`2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి సంస్థ.. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్ప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు వస్తాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇక్కడ దొరికే ఉ`8 బొగ్గు కార ణంగా.. మొత్తం రూ.43వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్ప్పుకొచ్చారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా వస్తుందని వివరించారు. తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతోపాటుగా.. సింగరేణి భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని వెల్లడించారు. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply