Monday, 17 August 2026
జాతీయం

అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట – ఏడుగురు భక్తుల దుర్మరణం

· · 1 నిమిషం చదవండి

పాట్నా : బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. శ్రావణమాసం సోమవారం కావడంతో ఈ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి మధ్యలో ఒక ఎలక్టిక్ వైర్ తెగిపడిపోవడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. షాక్ కొడుతుందనే ఆందోళనతో అక్కడినుంచి బయటకు పరిగెత్తే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడినవారిని సవిÖప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ దిగ్భాంª`రతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దానికి తగ్గట్టే మేం ఏర్పాట్లు చేశాం. భయాందోళన కారణంగా వారు పరిగెత్తడంతో బారికేడ్లు పడిపోయాయి. దాంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనకు ఎలక్టిక్ర్ వైర్ కారణంగా తెలుస్తోంది. ధ్రువీకరించుకున్న తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని లఖిసరాయ్ డిస్టిక్ట్ మేజిస్టేట్ర్ శైలేంద్ర కుమార్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *