Monday, 17 August 2026
తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి శ్రీకారం

· · 1 నిమిషం చదవండి

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు కేంద్రంగా తొలి అడుగు పడింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *