పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:
రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రూ. 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు
రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం
రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం
రూ. 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం
రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు
రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు
ఆత్మకూర్‌లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన
రూ. 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన
రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం
ప్రారంభోత్సవాల వివరాలు:
పరకాలలో రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం.
ఆత్మకూర్‌లో రూ. 1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం.
పరకాలలో రూ. 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం.

Leave a Reply