Monday, 3 August 2026
తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం

· · 1 నిమిషం చదవండి

మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే పక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమÖరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యున్నత ప్రాధాన్య జాబితాలో ఉంచి, సాధ్యమైనంతవరకు ఆరు నెలల్లో ప్రాజెక్టులవారీగా పర్యావరణ అనుమతులు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతుల పక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు న్యాయపరమైన స్పష్టతను కల్పించడంతోపాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త అవకాశాల ద్వారాలను తెరిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతి అర్హమైన ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సోమవారం రోజున రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సవిÖక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గతంలో చట్టబద్ధంగా పర్యావరణ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ఆ రక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే పరిశీలనలో ఉన్న దరఖాస్తులను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను ప్రాజెక్టులవారీగా సమగ్రంగా పరిశీలించి, సాంకేతిక, విధానపరమైన లోపాలను సరిదిద్దిన అనంతరం చట్టపరంగా అవకాశం ఉన్నచోట తిరిగి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై సుదూర ప్రభావం చూపగల ఈ తీర్పు వెలువడటం వెనుక తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు నిరంతరంగా సాగించిన న్యాయపోరాటం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ తీర్పులోని న్యాయసూత్రాలను లోతుగా అధ్యయనం చేసి, రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టుకు అవి ఏ విధంగా వర్తిస్తాయో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం అత్యంత కీలకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ విభాగాన్ని తగిన సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్?ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాలు, చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ వాదనను శాస్తీయ ఆధారాలు, సమగ్ర పత్రాలతో బలంగా వినిపించే సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర అధికారుల వద్ద అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అసలు పర్యావరణ అనుమతులు, ఆ తర్వాత ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న మార్పులు, రీడిజైన్, విస్తరణ, ప్రాజెక్టు ప్రాంత మార్పు, పెండింగ్ దరఖాస్తులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, పాటించాల్సిన నిబంధనలు, జరిమానాలు ఉంటే వాటి వివరాలు?ఇలా ప్రతి అంశాన్ని ఒకే సమగ్ర దస్త్రంలో పొందుపరచాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *