Friday, 7 August 2026
తెలంగాణ

‘తుమ్మిడిహెట్టి’ ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి

· · 1 నిమిషం చదవండి

తెలంగాణ`మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి
జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి

న్యూఢిల్లీ : ప్రాణహితనదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావంపెద్దగా ఉండదని వివరించారు. జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయన కార్యాలయంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్శక్తికి పంపిన లేఖ విషయాన్నిముఖ్యమంత్రి జల్‌శక్తి మంత్రితో ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్టాల్ర మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టివద్ద148మీటర్ల నుంచి 152మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించిందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందన్నారు. ముంపులోనూ 50 శాతం నదీగర్భం (రివర్ బెడ్)లోనే ఉంటుందని కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం వివరించారు. 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితేగ్రావిటీద్వారా కావల్సినంత నీరు సరఫరాచేయలేమని, కాబట్టి150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను సీఎం కోరారు. తుమ్మిడిహెట్టివద్ద 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాతో విద్యుత్ వినియోగం భారం ఉండదని, ఈ నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంతత్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్యసమావేశం ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వసతి ఏర్పడుతుందని సీఎం వివరించారు. ప్రధానమంత్రికార్యాలయం నుంచి లేఖ అందిందని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోసమావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల పక్రియప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తాననిజల్‌శక్తి మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లురవి, వేంనరేందర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ యాదవ్, డాక్టర్ కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వప్రత్యేకప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారుఆదిత్యనాధ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ.శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *