Monday, 3 August 2026
తెలంగాణ

పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోండి..

· · 1 నిమిషం చదవండి

ఎన్ ఆర్ ఐ లకు మంత్రి జూపల్లి పిలుపు
హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రవాస భారతీయులు కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎటిఎ) మహాసభల్లో పాల్గొన్న ఆయన, తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎటిఎ బృందాలు, ఎన్ గ్రూపులు దత్తత తీసుకుని వాటి అభివృద్ధి, పరిరక్షణకు సహకరించాలని కోరారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు అక్కడి ఆర్థిక, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేయడమే కాకుండా, తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని జూపల్లి కొనియాడారు. 1990లో స్థాపించబడిన ఎటిఎ తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో విశేష సేవలు అందిస్తోందని ప్రశంసించారు. తెలంగాణకు వచ్చే ప్రవాస భారతీయులకు అన్ని సేవలు ఒకే చోట లభించేలా హైదరాబాద్ రూ.10 కోట్ల వ్యయంతో ఎన్ భవన్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *