ఎఐ టెక్నాలజీతో జిఎస్‌టి వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
హైదరాబాద్: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుÂÅళ్లే దిశగా జిఎస్‌టి అధికారులకు ప్రత్యేక ఎఐ ఆధారిత సమాచారంతో ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సిఎం సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉంటోందని ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. హైదరాబాద్ ఎంసిఆర్ హెచఆర్‌డి బోధి పెవిలియన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట ఖజానాకు జిఎస్‌టి రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ)ను వినియోగించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై అరవింద్ సుబ్రమణియన్‌తో సిఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా జిఎస్‌టి, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్ సుబ్రమణియన్‌తో చర్చించారు. ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీ¹Åజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఎఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్బంగా సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ డేటా తోపాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సిఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని సిఎం చెప్పారు. సమావేశంలో సిఎం సలహాదారు ÂÅ.రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply