పైవేటు’పాఠశాల ఫీజుల వివరాలు బహిర్గతం
పాఠశాల నోటీసు బోర్డులు, విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సిందే…
స్పందించని యాజమాన్యాలకు నోటీసులు…
హైదరాబాద్:రాష్ట్రంలోని పైవేటు, అనఎయిడెడ్ స్కూల్స్ ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల వారీగా ఫీజు వివరాలు పాఠశాల ప్రాంగణంలోని నోటీసు బోర్డ్‌లో పెట్టాలి. అలాగే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కÖడా ఆ వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఫీజులను బహిర్గతం చేయని పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పైవేటు, అనఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు 2026-27 విద్యాసంవత్సరానికి’ సంబంధించిన ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలని, ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జిఒ ఎం.ఎస్. నం.1 (1 జనవరి, 1994) లోని రూల్ 16, 18 ప్రతిపాదనల ప్రకారం పాఠశాల గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కÖడిన ఫీజుల నిర్ణయ పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్లను) అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫీజులను ఎలా నిర్ణయించారనే అంశాలకు సంబంధించి పాఠశాల గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కÖడిన డాక్యుమెంట్లను కÖడా పాఠశాల వెబ్‌సైట్ పోర్టల్‌లో పొందుపరచాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫీజు వివరాలను బహిరంగ పర్చని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, జిఒలోని రూల్ 11 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు, (ఆర్‌జెడి), జిల్లా విద్యాశాఖాధికారులను (డిఇఒ) విద్యాశాఖ ఆదేశించింది. అయితే రెండేళ్లకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపును ప్రతిపాదిస్తూ ఏడాదిన్నర క్రితమే ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన ప్రభుత్వం, దీనిపైన ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులపైన పైవేటు యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించగా, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ఉత్తర్వులు నిలిపివేశారు. దీంతో పైవేట యాజమాన్యాలే ఫీజులను నిర్ణయిస్తోంది. పైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు అత్యధికంగా ఫీజులను నిర్ణయించారు. దీంతో ఫీజులను నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో ఏ పాఠశాలలో ఎంత మేర ఫీజులను వసూలు చేస్తున్నారనే విషయమై స్పష్టత రానుంది. ఫీజుల వివరాల వెల్లడి విషయంలో పాఠశాల విద్యాశాఖ ఎటువంటి కాలపరిమితిని విధించకపోవడంతో ఇదే అదునుగా పైవేటు పాఠశాలలు కాలయాపన చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply