నవచరిత్రను  సృష్టించిన నికోలస్  మదురో

వెనిజులా విప్లవ వేగుచుక్క హ్యూగో చావెజ్ రాజకీయ వారసుడు, వెనిజులా అధ్యక్షుడు  నికోలస్ మదురో వరుసగా మూడవసారి  గెలుపొంది నవచరిత్రను సృష్టించారు. వెనిజులాలో గత ఆదివారం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించి 80 శాతం ఓట్లను లెక్కించగా నికోలస్ మదురో  51.20 శాతం ఓట్లు సాధించి మూడవసారి అధ్యక్షుడుగా ఘన విజయం సాధించడం లాటిన్ అమెరికాలో విశిష్ట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

కారకాస్‌లోని శ్రామిక తరగతి రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించిన నికోలస్ మదురో ఒక సాధారణ బస్ డ్రైవర్ ఉద్యోగి నుండి అంతిమంగా దేశ అధ్యక్షుడుగా ను ఎన్నిక కావడమే కాకుండా మూడు సార్లు అధ్యక్షుడుగాను హ్యాట్రిక్ సాధించడం అనన్య సామాన్యం. సామ్రాజ్యవాద దేశాలు మినహా మిగతా అన్ని దేశాల ప్రజానీకం ఆయనకు అభినందనల సందేశాలతో ముంచెత్తడాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు.  ‘శాంతి మరియు చట్టం పట్ల గౌరవం  ఉంది. దేశంలో శాంతి, సుస్థిరత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణలను వెనిజులా దేశ ప్రజానీకం కోరుకుంటుంది. ఆ  దిశగా మరింతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’  అని మూడవసారి అధ్యక్షుడుగా విజయం సాధించాక నికోలస్ మదురో పేర్కొనడాన్ని చాలా సృష్టంగా గమనించవచ్చు.

వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పది మంది దాకా అధ్యక్ష పదవికి పోటీ నెలకొన్ననప్పటికీ ప్రధాన పోటీ నికోలస్  మదురో మరియు యూనిటరీ డెమొక్రటిక్‌ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఎడ్మండో గొంజాలెజ్‌ మధ్యన  కొనసాగింది. నికోలస్ మదురో ప్రధాన ప్రత్యర్థి అయిన  ఎడ్మండో గొంజాలెజ్‌కి  కేవలం 44.02  శాతం ఓట్లు లభించడం గమనార్హం. అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో వెనిజులా అధ్యక్ష ఎన్నికలు  సజావుగా జరిగిననూ ఎన్నికల లెక్కింపులో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేయడం అసహేతుకతకు నిదర్శనం కాగలదు.

ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూస్తే  ‘వెనిజులాలో గత 25 ఏళ్లుగా  కొనసాగుతున్న సోషలిస్ట్ పాలనను ప్రజలు కొనసాగించాలి’ అని కోరుకోవడాన్ని చాలా సృష్టంగా గమనించవచ్చు. ఏది ఏమైననూ అమెరికా  కుట్రాజకీయాలతో మిలాఖత్ కాబడి అనేక అడ్డంకులు సృష్టించిననూ ప్రజలు వాటన్నింటిని నిలువరించి మూడోసారి కూడా నికోలస్ మదురోని అధ్యక్షుడుగా ఎన్నుకోవడం ‘వెనిజులా రాజకీయాలలో  చారిత్రాత్మక ఘట్టాన్ని  ఆవిష్కరించింది’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  అమెరికన్ సామ్రాజ్యవాద శక్తులు ఎన్ని కుట్రలకు పాల్పడిననూ బొలివేరియన్‌ విప్లవ స్ఫూర్తిని తుదముట్టించలేరు. వెనిజులాలో బొలివేరియన్‌ విప్లవ స్ఫూర్తి కలకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

– జె.జె.సి.పి. బాబూరావు,
రీసెర్చ్ స్కాలర్.

 

 

 

 

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry