భారీగా తరలి వచ్చిన భక్తులు
విశాఖపట్టణం : సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి అనిత స్వామికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం తితిదే దేవస్థానం స్వామికి పట్టువస్తాలు సమర్పించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి లక్షల మంది భక్తులు తరలిరానుండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అయితే సింహాచలం చందనోత్సవంలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలిరావడంతో కొంద ఇబ్బంది ఏర్పడింది. దాంతో భక్తులు గంటల తరబడి సింహాచలం బస్టాండ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో సైతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు. బస్టాండ్‌కు నుంచి సింహాచలం కొండపైకి వెళ్లే బస్సుల్లో భక్తులు కిక్కిరిసి పోయారు. బస్సులు ఎక్కడానికి ఎగబడిపోయారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంత భక్తుల అవస్థలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంటున్నామని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad















