ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై..?

ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది..? కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిజంగానే గాయపడ్డాడా..? లేదా కావాలనే గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడా..? మేనేజ్‌మెంట్‌తో విభేదాల రావడంతో టీమ్‌ను వీడాలని నిర్ణయించుకున్నాడా..? ఈ ప్రశ్నలకు బలాన్ని చేకూర్చేలా ముంబై ఇండియన్స్ అకౌంట్‌ను అన్‌ఫాలో చేసి.. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్‌కు చెందిన పోస్టులను మొత్తం డిలీట్ చేశాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై.. ఈసారి దారుణమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. మొదటి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించినా.. ఆ తరువాత టీమ్ పూర్తిగా గాడి తప్పింది. రోహిత్ శర్మ గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లు దూరం కావడం.. బుమ్రా వికెట్లు తీయకపోవడం.. సూర్యకుమార్ యాదవ్ పూర్ ఫామ్‌లో ఉండడం.. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో పాండ్యా విఫలమవ్వడం.. జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సీజన్‌లో పాండ్యా మూడు మ్యాచ్‌ల్లో ఆడలేదు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పాండ్యాపై వార్తలు మొదలయ్యాయి. వచ్చే సీజన్‌కు పాండ్యా మరో జట్టులోకి వెళతాడని ప్రచారం మొదలుపెట్టారు. తన మాజీ టీమ్ గుజరాత్ టైటాన్స్‌లోకి మళ్లీ వెళ్లిపోతాడని రూమర్లు అంటూ స్టార్ చేశారు. హెడ్ ఆశిష్ నెహ్రూకు కాల్ చేసి.. ‘నెహ్రా.. జీ నేను వచ్చేస్తున్నా..’ అన్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా గాయంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. పాండ్యా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడని.. వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. అతని ఫిట్‌నెస్ విషయంలో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదని.. అందుకే ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌కు అతనికి విశ్రాంతినిచ్చినట్లు తెలిపారు. అతని పరిస్థితిని బట్టి వచ్చే మ్యాచ్‌కు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.