28 వేల మంది విద్యార్థులకు ఆహారం అందించే భారీ వంటశాల

ముఖ్యమంత్రితో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులు భేటీ
ఇప్పటికే ప్రారంభమైన భారీ వంటశాల పనులు
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఈ సెంట్రలైజ్డ్‍ మెగా వంటశాల ద్వారా కొడంగల్‌ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. కొడంగల్‌ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్‍ కిచెన్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాదులో సిఎం రేవంత్‌రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్‌ నగర్‌ జిల్లా కొడంగల్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఓ సెమీ రెసిడెన్షియల్‌ స్కూలు స్థాపించడంపై రేవంత్‌రెడ్డితో చారిటబుల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు చర్చలు జరిపారు. భారీ వంటశాలకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే కొడంగల్‌ లో మొదలయ్యాయి. ఈ భారీ వంటశాలను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్‌) నిధుల సాయంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌ నిర్వహించనుంది. ఈ వంటశాల పూర్తయ్యాక కొడంగల్‌లో సెమీ రెసిడెన్షియల్‌ స్కూలు కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని సిఎం తెలిపారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry