రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే అందులో మొట్ట మొదటి త్యాగం.. సాహసం సోనియాగాంధీది. ఆనాడు యూపీఏ చైర్ పర్సన్‌గా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు.
బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి. అప్పుడు లోక్ సభ స్పీకర్. ఒక మహిళగా.. కన్న తల్లిగా పిలల్లను కోల్పోతే ఒక ఆవేదన ఎట్లుందో తెలిసిన అమ్మగా.. మీరా కుమారి ఆ రోజు సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో ఆమోదించడంలో అత్యంత కీలకమైన బాధ్యతను పోషించారు.
ఆనాడు భారతీయ జనతాపార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్. ఆనాడు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ బిల్లు ఆమోదించటంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తన సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకారం తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.
తెలంగాణ నలుమూలల నుండి తరలివచ్చిన వేలాదిమంది అడబిడ్డల సాక్షిగా సోనియాగాంధీ, మీరా కుమారి, సుష్మాస్వరాజ్‌లకు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్న. తెలంగాణ చరిత్ర పుటల్లో మీ త్యాగానికి.. మీరు తీసుకున్న గొప్ప నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad















