‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌ ట్రాక్‌ విడుదల

బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బ్యాంక్‌ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, శ్రీమతి గారు గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ ట్రాక్‌ విడుదలైంది. జులై 28న దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ ట్రాక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలం చూపించారు.‘శభాష్‌ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా’ అంటూ తనదైన సాహిత్యంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కథానాయకుడి పాత్రను ఆవిష్కరించడంతో పాటు, శ్రోతలలో స్ఫూర్తి నింపేలా సాహిత్యాన్ని అందించారు. దుల్కర్‌ సల్మాన్‌ సినీ ప్రయాణంలో మరొక చిరస్మరణీయమైన చిత్రంలా నిలిచేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని మలుస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry