సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. తేజ సజ్జ, మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్‌తో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గౌరహరి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. ‘మిరాయ్’ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని టిజి విశ్వ ప్రసాద్ తెలిపారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad















