మహిళా రిజర్వేషన్ల బిల్లు నేరుగా ఆమోదించాలి

మహిళా రిజర్వేషన్ల బిల్లు నేరుగా పార్లమెంట్ అమోదించాలి. మహిళా సాధికారతకు అందరూ అంగీకరించాలి.77 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం ఇంకా మహిళల పట్ల వివక్షత అంగీకారం కాదు. ఇది ఏకగ్రీవంగా ఆమోదం కావాలి.అందుకు సభ్యులు,పార్టీలు కలసి ముందుకు సాగాలి.లింకు రాజకీయాలు మానాలి.మహిళా రిజర్వేషన్ల బిల్లు శుక్రవారం లోక్ సభలో వీగిపోవడంతో డీలిమిటేషన్ ప్రక్రియ కు తాత్కాలికంగా దారి మూసుకుపోయింది. ప్రతిపక్షం,దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరిస్తేగాని మళ్లీ ముందుకు సాగదు. మహిళా బిల్లు వీగిపోవడంతో అధికార బీజేపీ పక్షం మిగిలిన రెండు బిల్లులను వెనక్కి తీసుకుంది.50శాతం సీట్లు పెరుగుతాయని హోం మంత్రి షా హామీ ఇచ్చినా బిల్లులో చేర్చలేదు.అదికూడా ప్రతిపక్షాల వ్యతిరేకత కు కారణమయింది.డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లు లింక్ పెట్టి తమ పంతం నెగ్గించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.దాంతో అధికారపార్టీ ఆలోచనలో పడింది.106వరాజ్యాంగ సవరణ తో 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం గజిట్లోనోటిఫై అయింది.దీని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తరువాత రాష్ట్రాల అసెంబ్లీ లు,లోక్ సభలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.ఎస్సీ ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లకూ ఇది వర్తి‌స్తుంది. ఈ చట్టప్రకారం రిజర్వేషన్లు 15 సంవత్సరకాలం అమలులో ఉంటాయి.కాగా పార్లమెంటు నిర్ణయం వరకూ కొనసాగుతుంది.2023 మహిళా రిజర్వేషన్ చట్టం వల్ల తక్షణప్రయోజనం ఏమీ ఉండదు. జనగణన,నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.

2011 జనగణన మేరకు డీలిమిటేషన్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది.కాని దక్షిణాది రాష్ట్రాలు తాము జనాభా నియంత్రణ చేయడంవల్ల జనాభా దామాషా మేరకు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నాయి.50 శాతం సీట్లు పెరిగితే తమకు ఆమోదమేనని షరతు పెట్టాయి.కాని మహిళా రిజర్వేషన్ బిల్లును 131 రాజ్యాంగ సవరణ బిల్లు,మరో బిల్లు కలిపి ఒకేసారి ఆమోదించే లా బీజేపీవ్యూహం పన్నింది.కాని ప్రతిపక్షాలు దాన్ని పడనీయకుండా అడ్డుకున్నాయి. దాంతో పరస్పరం మహిళా రిజర్వేషన్ల వ్యతిరేకపార్టీలని ఆరోపించుకున్నాయి.

డిలిమిటేషన్ జరిగితే పార్లమెంటు (లోక్ సభ లో ) సభ్యుల సంఖ్య 850 కి చేరుతుంది.అంటే ఇప్పుడున్న 550(ఎన్నికలు జరిగేవి 543) కి తోడు మరో 300 సీట్లు పెరుగుతాయి. కాని మహిళా రిజర్వేషన్లు అమలయితే వారికి దక్కేది 273 స్థానాలు మాత్రమే.అంటే పెరిగే 300 స్థానాల్లో మరో 20+ స్థానాలు పురుషులకే 543కు జత అవుతాయి. రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయి. రిజర్వేషన్లు అమలు జరగాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని 2023 చట్టంలో షరతు పెట్టడం వెనుక కారణం ఇదే.పురుష నాయకులు స్థానాలు తగ్గరాదనే భావన కనిపిస్తున్నది.ఈ విషయంలో ఉత్తరాది,దక్షిణాది మధ్య విభేదాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది పెత్తనం కొనసాగుతుందని దక్షణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.జనాభా ప్రాతినిధ్యం ఒక ప్రజా ప్రతినిధికి ఐదులక్షల నుంచి 30 లక్షలవరకూ పెరిగింది.ఈ పరిస్థితుల్లో డీ లిమిటేషన్ అవసరమైన ఇతర పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినకుండా చట్టాలు చేయాలి.నియోజకవర్గాలు పెరిగితే పలు సౌకర్యాలు పెంచాలి.ఆర్ధికంగా కూడా భారం పెరుగుతుంది. సభ్యులు జీతభత్యాలు,అలెవెన్సులు రూపంలో కేంద్రం, రాష్ట్రాలకుమరింత ప్రజాధనం ఖర్చు పెరుగుతుంది.ఇప్పటికే అప్పుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్రాలు మరింత అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది.నియోజకవర్గాలు పెరిగే కొద్ది ఇతర సౌకర్యాలు,అధికారులు నియామకాలతో మరింత ఖర్చు పెరుగుతుంది.ఇప్పుడు డీ లిమిటేషన్ లేకుండా ఉన్న 550 స్థానాల్లో నే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వ విశ్వాసం నిలిచేది.డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు కలగలిపి 2029 ఎన్నికల్లో మరో సారి గెలవాలని బీజేపీ వ్యూహం వేసింది.కాని బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో అధికార బీజేపీ వ్యూహం మార్చుకునే పరిస్థితి ఏర్పడింది.మరి అమిత్ షా,మోదీ ద్వయం ఈ సారి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి.ఏదిఏమైనా మహిళా సాధికారత పెరిగేలా మహిళా రిజర్వేషన్ల చట్టం రావాల్సిన అవసరం ఉంది.కాని ఏ
ఎలాంటి లింకు లేకుండా నేరుగా బిల్లు పార్లమెంట్ ఆమోదం కోసం అధికార.ప్రతిపక్షాలు కలసి కృషి చేయాల్సిన అత్యావశ్యకత ఉంది.

యం.వి.రామారావు

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry