హైదరాబాద్: యువ క్రీడాకారులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బిఐ) ఎంతో ప్రొత్సహిస్తోందని ఎస్బిఐ సిడిఒ, డిఎండి(హెచ్ఆర్) ఒపి మిశ్రా అన్నారు. ఆల్ ఇండియా ఎస్బిఐ ఇంటర్ -సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతల బహుముతల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు ట్రోపీలను, ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఒపి మిశ్రాతో పాటు ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం రాజేష్ కుమార్, అమరావతి సిజిఎం నవీన్ చంద్రఝా తదితరులు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు జరిగిన ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్లో ఎస్బిఐ బెంగుళూరు సర్కిల్ అసాధారణ ప్రదర్శమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి,విజయం సాధించింది. రన్నరప్‌గా ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ నిలిచింది.

అలాగే బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ ఔలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆటగాళ్లకు వ్యక్తిగత ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు స్ఫూర్తిని ప్రదర్శించాయని, సంస్థలోని క్రికెట్ ఔత్సాహికులమధ్య స్నేహభావాన్ని పెంపొందించిందన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభను కనబర్చారని ఆయన కొనియాడారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad















