‘ఆయ్‌’ నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్‌’. ఎనర్జిటిక్‌ హీరో నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్‌’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ ఆయ్‌ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు.
‘‘పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్‌
ఆహా.. అమ్మ లాలో రామ్‌ భజన
మాట లేదు.. మనువు లేదు.. మనసిచ్చేసిందండోయ్‌
అమ్మ లాలో రామ్‌ భజన..’’
అంటూ అమ్మాయి మనసులో ప్రేమను తెలియజేసేలా ‘ఆయ్‌’ సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మధ్య ప్రేమను తెలియజేసేలా సాగుతోన్న ఈ పాటను మన బుర్రకథ పంథాలో చిత్రీకరించటం వైవిధ్యంగా అనిపిస్తోంది. మన గొప్ప సంప్రదాయం, సంస్కృతికి హృదయపూర్వక నివాళిగా నిలుస్తుంది. అది పాటలో స్పష్టంగా చిత్రీకరించబడిరది. అజయ్‌ అరసాడ సంగీతం అందించిన ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాటను దర్శకుడు అంజి కె.మణిపుత్ర చాలా చక్కగా రాశారు. పెంచల్‌ దాస్‌ పాటను పాడిన తీరు చాలా సహజ సిద్ధంగా ఉంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry